Rohit Sharma ruled out: టీమిండియాకు మరో షాక్.. మూడో వన్డేకు రోహిత్ దూరం
- Author : Gopichand
Date : 08-12-2022 - 8:06 IST
Published By : Hashtagu Telugu Desk
బంగ్లాదేశ్ చేతుల్లో ఇప్పటికే వన్డే సిరీస్ ఓడిన టీమిండియా(Team india)కు మరో షాక్ తగిలింది. సిరీస్ క్లీన్‌స్వీప్ తప్పించుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన చివరి మ్యాచ్‌కు ముగ్గురు ప్లేయర్స్ గాయాల కారణంగా దూరమయ్యారు. రోహిత్ శర్మ (Rohit Sharma), పేస్ బౌలర్ దీపక్ చహర్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లు మూడో వన్డేలో ఆడడం లేదని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు.
బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆడటం అనుమానంగానే ఉంది. రెండో వన్డే సందర్భంగా బుధవారం (డిసెంబర్ 7) ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది. రోహిత్ ఫీల్డింగ్ చేయలేదు. కేఎల్ రాహుల్ బాధ్యతలు స్వీకరించాడు. అయితే బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ ఎట్టకేలకు క్రీజులోకి వచ్చి హాఫ్ సెంచరీ కూడా చేశాడు. అయినప్పటికీ జట్టు గెలవలేకపోయింది. మ్యాచ్ అనంతరం కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. నిపుణుల నుంచి సలహాలు తీసుకునేందుకే రోహిత్ స్వదేశానికి తిరిగి వెళ్తున్నట్లు తెలిపాడు. ఫాస్ట్ బౌలర్లు దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ కూడా గాయాల కారణంగా మూడో వన్డేకు దూరమైనట్లు ద్రవిడ్ తెలిపాడు. అదే సమయంలో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. బొటనవేలు గాయం పెద్దది కాదు. అదృష్టవశాత్తూ ఫ్రాక్చర్ లేదు. అందుకే నేను బ్యాటింగ్ చేయగలిగాను అని తెలిపాడు.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే రోహిత్ గాయపడ్డాడు. ఆ తర్వాత స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేశాడు. ఈ ఓవర్లో మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేశాడు. సిరాజ్ వేసిన బంతి అనాముల్ హక్ బ్యాట్‌కు తగిలి స్లిప్‌లోకి వెళ్లింది. బంతి రోహిత్ ఎడమ చేతి బొటన వేలికి తగిలి గాయమైంది. ఆ తర్వాత రోహిత్ నొప్పితో వెంటనే మైదానం నుంచి బయటకు వెళ్లాడు.
Also Read: Umran Malik: అది బంతి కాదు బుల్లెట్.. అవాక్కయిన బంగ్లా బ్యాటర్
దీపక్ చాహర్ మళ్లీ గాయపడ్డాడు. రెండో వన్డేలో బౌలింగ్ చేస్తుండగా స్నాయువు స్ట్రెయిన్‌కు గురయ్యాడు. అతను తన కోటాలో మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. గత నాలుగు నెలల్లో చాహర్ గాయపడడం ఇది మూడోసారి. అతను స్నాయువు, వెన్నునొప్పి కారణంగా దాదాపు ఆరు నెలల పాటు దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా చాహర్ ఐపీఎల్‌లో కూడా ఆడలేకపోయాడు. చాహర్ గాయం నుంచి కోలుకొని జింబాబ్వేతో మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ కు గాయం కారణంగా వైదొలిగాడు. వెన్ను సమస్య కారణంగా దీపక్ టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు.