Umran Malik: అది బంతి కాదు బుల్లెట్.. అవాక్కయిన బంగ్లా బ్యాటర్
- By Gopichand Published Date - 08:26 PM, Wed - 7 December 22

బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో టీమిండియా ఎక్స్‌ప్రెస్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) అదరగొట్టాడు. అనూహ్యంగా బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపికైన ఈ పేస్ సంచలనం గంటకు 151 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తూ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతని పేస్ ధాటికి బంగ్లా బ్యాటర్ల కనీసం ఒక్క బంతిని కూడా టచ్ చేయలేకపోయారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ బ్యాటర్ షాంటోను అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో మాలిక్ (Umran Malik) క్లీన్ బౌల్డ్ చేశాడు.
గంటకు 151 కిమీ వేగంతో వేసిన డెలివరీని షాంటో ఆపే లోపే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో బంగ్లా బ్యాటర్ కూడా బిత్తరపోయాడు. స్టన్నింగ్ డెలివరీకి షాంటోతో పాటు మైదానంలో ఉన్న అభిమానులు, ప్రేక్షకులు అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఉమ్రాన్ మాలిక్ వేసిన తొలి 5 ఓవర్లలో రెండు ఓవర్లు మెయిడిన్ అయ్యాయి. ఉమ్రాన్ వేసిన బంతులను టచ్ చేసేందుకు కూడా బంగ్లా బ్యాటర్లు తడబడ్డారు. ఉమ్రాన్ తన తొలి ఓవర్‌లోనే బంగ్లా బ్యాటర్ షకీబ్ అల్ హసన్‌కు చుక్కలు చూపించాడు. ఉమ్రాన్ బౌలింగ్‌లో బంతిని ముట్టడానికే షకీబ్ భయపడ్డాడు.మొత్తం మీద ఉమ్రాన్ మాలిక్ పేస్ దెబ్బకు బంగ్లాకు చుక్కలు కనిపించాయి.
Also Read: India vs Bangladesh: వన్డే సిరీస్ బంగ్లాదే.. టీమిండియాపై విజయం