వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు కష్టమే?!
ప్రస్తుతం అన్ని జట్ల కళ్లు 2027 వన్డే ప్రపంచకప్‌పైనే ఉన్నాయి. గత వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరగగా, ఫైనల్లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.
- Author : Gopichand
Date : 17-03-2026 - 4:56 IST
Published By : Hashtagu Telugu Desk
ODI World Cup 2027: టీ-20 వరల్డ్ కప్ 2026 తర్వాత పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించింది. ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుని పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ సాధించిన ఈ విజయంతో 2027 వన్డే ప్రపంచకప్ క్వాలిఫికేషన్ సమీకరణాలు మారిపోయాయి. దీనివల్ల బంగ్లాదేశ్ మార్గం సుగమం కాగా, వెస్టిండీస్ జట్టుకు కష్టాలు మొదలయ్యేలా ఉన్నాయి.
పాకిస్థాన్ ఓటమితో వెస్టిండీస్‌కు నష్టం
పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్ గెలవగా, రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ పుంజుకుని సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అయితే నిర్ణయాత్మకమైన ఆఖరి వన్డేలో బంగ్లాదేశ్ అద్భుతంగా ఆడి 11 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ ఓటమితో వన్డే ప్రపంచకప్ 2027 క్వాలిఫికేషన్ రేసులో వెస్టిండీస్ వెనుకబడింది. సిరీస్ గెలిచిన తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ 10వ స్థానం నుండి 9వ స్థానానికి చేరుకోగా, వెస్టిండీస్ 9వ స్థానం నుండి 10వ స్థానానికి పడిపోయింది.
Also Read: ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడి.. బాసిజ్ కమాండర్ మృతి!
వరల్డ్ కప్ 2027 క్వాలిఫికేషన్ రూల్స్
2027 వన్డే ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఆతిథ్యం ఇస్తున్నాయి. ఆతిథ్య దేశాలుగా ఈ రెండు జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన 8 జట్లు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఆధారంగానే ప్రపంచకప్‌లోకి ప్రవేశిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వెస్టిండీస్ రాబోయే వన్డే మ్యాచ్‌ల్లో కూడా ఓడిపోతే 2027 వన్డే వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ రేసు నుండి తప్పుకోవాల్సి వస్తుంది.
రాబోయే షెడ్యూల్
బంగ్లాదేశ్: డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడనుంది.
వెస్టిండీస్: అక్టోబర్‌లో భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లో తలపడనుంది.
ప్రస్తుతం అన్ని జట్ల కళ్లు 2027 వన్డే ప్రపంచకప్‌పైనే ఉన్నాయి. గత వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరగగా, ఫైనల్లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.