HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rohit Sharma Complains To Bcci Against Sunil Gavaskar

Rohit Sharma: ఆ భయంతోనే రోహిత్ రంజీ ఆడాడా..?

రోహిత్ రెండు ఇన్నింగ్స్‌లలో 3, 28 పరుగులు చేయగా, శ్రేయాస్ రెండు ఇన్నింగ్స్‌లలో 11, 17 పరుగులు చేశాడు.

  • Author : Naresh Kumar Date : 30-01-2025 - 6:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rohit Sharma
Rohit Sharma

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), శ్రేయస్ అయ్యర్‌లపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. రంజీ క్రికెట్లో వాళ్ళిద్దరి ప్రదర్శనపై సన్నీ సంచలన కామెంట్స్ చేశాడు. సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్ కి రోహిత్ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. నిజానికి రోహిత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పుడు దేశవాళీ క్రికెట్లోనూ రాణించలేకపోతున్నాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా రోహిత్ బాటలోనే పయనిస్తున్నాడు.

రోహిత్ రెండు ఇన్నింగ్స్‌లలో 3, 28 పరుగులు చేయగా, శ్రేయాస్ రెండు ఇన్నింగ్స్‌లలో 11, 17 పరుగులు చేశాడు. జమ్మూ కాశ్మీర్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్ పై ఎటాకింగ్ చేయాల‌నే రోహిత్‌, శ్రేయ‌స్‌ల నిర్ణ‌యాన్ని గవాస్కర్ తీవ్రంగా త‌ప్పుప‌ట్టాడు. లోయ‌ర్ ఆర్డ‌ర్ ఆట‌గాళ్లు శార్దూల్ ఠాకూర్, త‌నుష్ కొటియ‌న్‌ల‌ను చూసి నేర్చుకోవాల‌ని హెచ్చరించాడు. పైగా టెస్టుల్లో దూకుడు పనికిరాదని, ఇలా టెస్టుల్లో దూకుడుగా ఆడటం ద్వారా భవిష్యత్తులో టెస్ట్ క్రికెట్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు.టెక్నిక్‌తో షాట్లు కొట్టాలి, అంతేకానీ ప్ర‌తి బంతిని బౌండ‌రీకి త‌ర‌లించాల‌ని అనుకోకూడదని ఇద్దరికీ చురకలంటించాడు. వాళ్ళ ఆటను చూస్తే దేశవాళీలో ఆడేందుకు ఇష్టపడినట్లు కనిపించలేదని, బీసీసీఐ కాంట్రాక్ట్‌ నుంచి తప్పిస్తుందనే భయంతోనే రంజీ ఆడిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌న్నాడు.

Also Read: RCB: ఆర్సీబీకి కష్టాలు తప్పవా.. ఓపెనింగ్ జోడీపై ఉత్కంఠ

గ‌తంలో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు నిరాక‌రించిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్‌లను సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ల నుంచి బీసీసీఐ త‌ప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రోహిత్, య‌శ‌స్వి జైస్వాల్ తమ సెంట్రల్ కాంట్రాక్ట్‌లు కోల్పోకుండా ఉండేందుకు ఆడిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌న్నారు గవాస్కర్. అయితే సన్నీ వ్యాఖ్యలపై రోహిత్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. తనను కించపరిచేలా విమర్శించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. దీంతో సన్నీపై బీసీసీఐకి ఫిర్యాదు కూడా చేశాడట. గవాస్కర్‌ తనను అంతగా విమర్శించాల్సిన అవసరంలేదని, గవాస్కర్ కామెంట్స్ కారణంగా మరింత ఒత్తిడికి గురైనట్లు రోహిత్ ఫిర్యాదులో పేర్కొన్నట్లో బీసీసీఐలో పనిచేసే ఓ అధికారి చెప్పాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • cricket news
  • Ranji Trophy
  • rohit sharma
  • sports news
  • Sunil Gavaskar

Related News

We couldn't understand the pitch conditions quickly.

IND vs IRE: పిచ్ కండిషన్స్‌ను త్వరగా అర్థం చేసుకోలేకపోయాం..

టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్‌కు ఐర్లాండ్ జట్టు ఊహించని షాకిచ్చింది. రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న‌ బెల్‌ఫాస్ట్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఈ విజయంతో ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇప్పటివరకు ఏ ఫార్మాట్‌లోనూ భారత్‌పై గెలవని ఆ జట్టు, ఈ మ్యాచ్‌తో ఆ రికార్డును బద్దలుకొట్టింది. ఐర్లాండ్ నిర్దే

  • There is no certainty that he will play in the IPL.

    Hardik Pandya: ఐపీఎల్ లో అతడు ఆడుతాడన్న నమ్మకం లేదు

  • Telugu girl Sricharani shines in T20 bowling rankings; Minister Lokesh says AP is proud.

    Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్‌ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

  • Nitish Kumar Reddy injured; ruled out of Ireland series; participation in England tour also doubtful.

    Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డికి గాయం.. ఐర్లాండ్ సిరీస్‌కు దూరం.. ఇంగ్లాండ్‌ టూర్‌కూ అనుమానమే.?

  • Only by doing this will India reach the Women's T20 World Cup semi-finals... otherwise, it's back home!

    Women’s T20 World Cup 2026: ఇలా చేస్తేనే మహిళల T20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్ కు ..లేదంటే ఇంటికే..!

Latest News

  • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd