HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Is Rcb Going To Have A Hard Time

RCB: ఆర్సీబీకి కష్టాలు తప్పవా.. ఓపెనింగ్ జోడీపై ఉత్కంఠ

వేలంలో ఆర్సీబీ సాల్ట్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే సాల్ట్ ఫామ్ సమస్య ఆర్సీబీని కలవరపెడుతోంది.

  • Author : Naresh Kumar Date : 30-01-2025 - 5:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
RCB
RCB

RCB: ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో సాల్ట్ వరుసగా వైఫల్యం చెందుతున్నాడు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ అంచనాలను అందుకోలేకపోయాడు. సాల్ట్ 3 మ్యాచ్‌లలో 9 పరుగులు మాత్రమే చేశాడు. కోల్‌కతాలో జరిగిన తొలి మ్యాచ్‌లో 3 బంతులు ఎదుర్కొని సున్నాతో వెనుదిరిగాడు. దీని తర్వాత చెన్నైలో జరిగిన రెండో మ్యాచ్‌లో 3 బంతుల్లో 4 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇప్పుడు రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ 7 బంతుల్లో 5 పరుగులు చేసి హార్దిక్ పాండ్యాకు బలయ్యాడు. ఓ వైపు బెన్‌ డకెట్‌, లివింగ్‌స్టన్‌ లాంటి స్టార్ క్రికెటర్లు విజృంభించి జట్టుకు కీలక ఇన్నింగ్స్ ఇవ్వగా వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్​ మాత్రం పేలవ పామ్ తో ఆర్సీబీ (RCB) కొంప ముంచేటట్టు ఉన్నాడు.

వేలంలో ఆర్సీబీ సాల్ట్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే సాల్ట్ ఫామ్ సమస్య ఆర్సీబీని కలవరపెడుతోంది. సాల్ట్ ఇలాగే బ్యాటింగ్ చేస్తే ఆర్సీబీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. సాల్ట్ ఫామ్ కొనసాగకపోతే ఆర్సీబీ మరో ఓపెనర్ కోసం వెతుక్కోవాల్సిందే. మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫిల్ సాల్ట్‌ను 11.50 కోట్లకు కొనుగోలు చేసింది. నిజానికి ఫిల్ సాల్ట్ ని తక్కువ అంచనా వేయలేం.

Also Read: MahaKumbh Mela : కుంభమేళాలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు

గతేడాది కేకేఆర్‌ను ఛాంపియన్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు.ప్లేఆఫ్‌లు లేదా ఫైనల్స్‌లో భాగం కానప్పటికీ ఆరంభ మ్యాచుల్లో బలమైన ప్రదర్శన ఇచ్చాడు. గత సీజన్లో మొత్తం 12 మ్యాచ్‌లలో 182 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 4 హాఫ్ సెంచరీలు సాధించి 435 పరుగులు చేశాడు. మరో ఆర్సీబీ ఆటగాడు బ్యాటర్ లియామ్ లివింగ్ స్టోన్ మాత్రం ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. తొలి రెండు టీ20ల్లో విఫలమైనా కీలకమైన మూడో మ్యాచ్‌లో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.దూకుడుగా ఆడుతూ 24 బంతుల్లో ఫోర్, 5 సిక్సర్లతో సాయంతో 43 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket news
  • IPL
  • IPL 2025
  • rcb
  • sports news
  • virat kohli

Related News

BCCI refutes reports regarding Rohit Sharma's retirement.

Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలను ఖండించిన బీసీసీఐ

భారత మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డే కెరీర్ ముగింపునకు సంబంధించి గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎట్టకేలకు తెరదించింది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఆదివారం లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో వన్డే మ్యాచ్ రోహిత్ శర్మకు ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కాబోతోందంటూ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఈ వా

  • India's first ODI against England today... 'Ro-Ko' mania begins again.

    Ind Vs Eng: ఇంగ్లాండ్‌తో భారత్‌ తొలి వన్డే నేడు.. రో– కో మ్యానియా మళ్లీ స్టార్ట్

Latest News

  • Guntur woman case: గుంటూరులో మహిళను వివస్త్ర కేసులో 9 మంది అరెస్ట్

  • Char Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు ముంచెత్తడంతో చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

  • Kadambari Jethwani: కాదంబరి జెత్వాని బెదిరింపుల కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత చుట్టూ ఉచ్చు.

  • Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా రాహుల్ గాంధీపై ప్రధాని వ్యాఖ్యలు

  • Ram Mohan Naidu: మేడ్-ఇన్-ఇండియా C-295 మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ తొలి రూపాన్ని రామ్ మోహన్ నాయుడు పంచుకున్నారు.

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd