KKR Captaincy: కేకేఆర్ కెప్టెన్ అతడేనా.. హింట్ ఇచ్చిన బీసీసీఐ!
ప్రస్తుత ప్రదర్శన ఆధారంగానే ఆటగాళ్లను ఎంపిక చేశామని సెలెక్టర్లు చెబుతున్నారు. అయితే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ జట్టుకు సారధ్యం వహించిన భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో రింకూ సింగ్ కెప్టెన్సీలో ఆడటం గమనార్హం.
- By Gopichand Published Date - 07:15 AM, Thu - 19 December 24

KKR Captaincy: విజయ్ హజారే ట్రోఫీ విషయంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ జట్టుకు పవర్‌ఫుల్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ కి కెప్టెన్‌గా (KKR Captaincy) బాధ్యతలు అప్పగించింది. విజయ్ హజారే ట్రోఫీ కోసం ప్రకటించిన ఉత్తరప్రదేశ్ జట్టులో యువ ఉత్సాహంతో పాటు అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు చోటు దక్కింది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 ట్రోఫీలో అద్భుతంగా రాణించిన భువనేశ్వర్ కుమార్‌తో పాటు ఎందరో మెరుగైన బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లు ఉత్తరప్రదేశ్ జట్టులోకి వచ్చారు.
ప్రస్తుత ప్రదర్శన ఆధారంగానే ఆటగాళ్లను ఎంపిక చేశామని సెలెక్టర్లు చెబుతున్నారు. అయితే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ జట్టుకు సారధ్యం వహించిన భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో రింకూ సింగ్ కెప్టెన్సీలో ఆడటం గమనార్హం. రింకు ఇప్పటికే జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. దేశవాళీలో, ఐపిఎల్‌లో ఇలా ఫార్మేట్ ఏదైనా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు రింకు హజారే ట్రోఫీలో రాణిస్తే కేకేఆర్ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటుతాయి. కేకేఆర్ రింకూ సింగ్‌ను 13 కోట్లకు అంటిపెట్టుకుంది. ఈ పరిస్థితుల్లో రింకు విజయ్ హజారే ట్రోఫీలో ఆటగాడిగా, కెప్టెన్‌గా నిరూపించుకుంటే అతడిని కేకేఆర్ కెప్టెన్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Also Read: WTC Final Scenario: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడగలదా? గబ్బా టెస్టు తర్వాత మారిన లెక్కలు!
ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన 19 మందిలో అనుభవజ్ఞులైన బౌలర్లు భువనేశ్వర్ కుమార్, కరణ్ శర్మ, ప్రియమ్ గార్గ్, నితీష్ రాణా, అక్షదీప్ నాథ్, ఆర్యన్ జుయల్, మొహ్సిన్ ఖాన్ మరియు రింకూ ఉన్నారు. ఐదుగురు నెట్ బౌలర్లతో పాటు నలుగురు అదనపు ఆటగాళ్లు ఉత్తరప్రదేశ్ జట్టుకి ఎంపికయ్యారు. డిసెంబర్ 21న విశాఖపట్నంలో జమ్మూకశ్మీర్‌తో జరిగే మ్యాచ్‌తో ఉత్తరప్రదేశ్ టోర్నీలో తొలి మ్యాచ్ ఆడనుంది. 23న మిజోరం, 26న తమిళనాడు, 28న ఛత్తీస్‌గఢ్, 31న చండీగఢ్, జనవరి 3న విదర్భతో పోటీపడనుంది.