WTC Final Scenario: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడగలదా? గబ్బా టెస్టు తర్వాత మారిన లెక్కలు!
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు WTC పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో చివరి మ్యాచ్‌లో చోటు కోసం బలమైన పోటీదారుగా ఉంది.
- By Gopichand Published Date - 09:17 PM, Wed - 18 December 24

WTC Final Scenario: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC Final Scenario) మ్యాచ్‌లు ముగుస్తున్న కొద్దీ.. ఈ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టిక కూడా మారుతూనే ఉంది. పాయింట్ల పట్టికను ప్రవేశపెట్టినప్పటి నుండి టెస్ట్ క్రికెట్ పూర్తిగా మారిపోయింది. WTC ఫైనల్ మ్యాచ్‌కు చేరుకోవడానికి అన్ని జట్లు తమ శాయశక్తులా ప్రయత్నించడానికి ఇదే కారణం. ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ఫైనల్ మ్యాచ్‌కు చేరుకోలేకపోయిందంటే ఉత్కంఠను అంచనా వేయవచ్చు. వచ్చే ఏడాది ఫైనల్ ఆడేందుకు పోటీపడే జట్లను చూద్దాం.
దక్షిణాఫ్రికా
WTC ఫైనల్ పట్టికలో 63.33% విజయ శాతంతో దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్‌కు చేరుకోవడానికి బలమైన పోటీదారుగా ఉంది. ఆ జట్టు ఇప్పుడు పాకిస్తాన్‌తో స్వదేశంలో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడాల్సి ఉంది. అందులో ఒక మ్యాచ్‌లో గెలిచినా ఫైనల్‌కు చేరుకుంటుంది. ప్రోటీస్ జట్టు ఇటీవల స్వదేశంలో శ్రీలంకను 2-0తో ఓడించింది. స్వదేశంలో బంగ్లాదేశ్‌ను 2-0తో ఓడించింది.
Also Read: Mallya Assets Sales : విజయ్ మాల్యా ఆస్తులు అమ్మి బ్యాంకులకు 14 వేల కోట్లు – నిర్మలా సీతారామన్
WTC FINAL SCENARIO FOR INDIA IF GABBA TEST ENDS IN A DRAW:
– Assume SA beat Pak in one of their Test.
– India wins BGT 3-1, they will qualify for WTC final.
– India wins BGT 2-1, SL and Aus ends as 1-1 or SL 1-0.
– BGT ends 2-2, India can qualify if SL win by 1-0 or 2-0 Vs AUS. pic.twitter.com/QaQXztVr5Y— Mufaddal Vohra (@mufaddal_vohra) December 17, 2024
ఆస్ట్రేలియా
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు WTC పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో చివరి మ్యాచ్‌లో చోటు కోసం బలమైన పోటీదారుగా ఉంది. జట్టు ఇంకా మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో రెండు మ్యాచ్‌లు భారత్‌తో ఉన్నాయి. భారత్‌తో జరిగే బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ఆ జట్టు మరో మ్యాచ్‌లో ఓడిపోయినా.. శ్రీలంకతో సిరీస్‌తో ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉంది.
టీమిండియా
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-3 తేడాతో అనూహ్య పరాజయాన్ని చవిచూసిన టీమ్‌ఇండియా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. జట్టు చాలా కాలం అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు కంగారూ జట్టుతో జరిగే రెండు మ్యాచ్‌ల్లోనూ జట్టు గెలవాల్సి ఉండగా, ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది.