Centuries In IPL: ఐపీఎల్‌లో సెంచరీల మోత.. ఇప్పటివరకు ఆరు శతకాలు.. బట్లరే రెండు బాదాడు..!
ఈ ఏడాది ఐపీఎల్‌లో భారీ స్కోర్‌లు నమోదు చేసే ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు సార్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీ స్కోర్‌లను నమోదు చేసింది.
- Author : Gopichand
Date : 17-04-2024 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
Centuries In IPL: ఐపీఎల్ 2024 (Centuries In IPL)లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. మ్యాచ్‌లు ఒకదాన్ని మించి ఒక్కటి ఉంటున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్‌లో భారీ స్కోర్‌లు నమోదు చేసే ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు సార్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీ స్కోర్‌లను నమోదు చేసింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో మొదటిసారి ముంబై ఇండియన్స్‌పై 277పరుగులు చేసి రికార్డు స్కోరు నెలకొల్పిన హైదరాబాద్ జట్టు.. ఆ రికార్డును ఆ జట్టే బద్దలుకొట్టింది. సోమవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్లలో రికార్డు స్థాయిలో 287 పరుగులు చేసి ఓ భారీ రికార్డు నెలకొల్పింది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కంటే ముందు ఈ ఏడాది కేకేఆర్ జట్టు 272 పరుగులను చేసి తొలి రికార్డు సెట్ చేసింది. అయితే ఆ రికార్డును హైదరాబాద్ జట్టు 10 రోజుల్లోనే బద్దలు కొట్టింది.
ఇకపోతే ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఐదు శతకాలు నమోదయ్యాయి. తొలి సెంచరీ ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ నమోదు చేశాడు. అదే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ కూడా సెంచరీ చేసి తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ తర్వాత చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆటగాడు రోహిత్ శర్మ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. కానీ ఈ మ్యాచ్‌లో ముంబై ఓడిపోవాల్సి వచ్చింది.
Also Read: Kadiyam Srihari: పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య స్కామ్ లపై కడియం సంచలన ఆరోపణలు
ఆ తర్వాత సోమవారం సన్‌రైజర్స్ వర్సెస్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఆటగాడు ట్రావిస్ హెడ్ కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో ఐపీఎల్ 2024 సీజన్‌లో 4వ సెంచరీ నమోదైంది. అయితే తాజాగా కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన పోరులో కోల్‌కతా ఆటగాడు నరైన్ సెంచరీ బాది తన జట్టుకు భారీ స్కోర్ అందించడంతో సాయం చేశాడు. నరైన్ సెంచరీతో ఐపీఎల్ 2024 సీజన్‌లో ఇప్పటివరకు ఐదు సెంచరీలు నమోదయ్యాయి. అయితే ఇదే మ్యాచ్‌లో బట్లర్ మరో సెంచరీ (రెండోది) సాధించి తన జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు సెంచరీలు నమోదయ్యాయి.
We’re now on WhatsApp : Click to Join