Champions Trophy 2025: తేల్చేసిన పాకిస్థాన్.. ఇంకా మిగిలింది బీసీసీఐ నిర్ణయమే..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy 2025) పాకిస్థాన్‌లో జరగనుంది. ఇది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ రజా నఖ్వీ ప్రకటన.
- Author : Gopichand
Date : 20-07-2024 - 8:23 IST
Published By : Hashtagu Telugu Desk
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy 2025) పాకిస్థాన్‌లో జరగనుంది. ఇది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ రజా నఖ్వీ ప్రకటన. ఛాంపియన్స్ ట్రోఫీకి హైబ్రిడ్ మోడల్‌ను పరిగణనలోకి తీసుకోబోమని కూడా నఖ్వీ ఐసీసీకి స్పష్టం చేశారు. భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ వెళ్లడంతో ఈ వ్యవహారం మొదలైంది. ఇప్పటి వరకు బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. మీడియా కథనాల ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా పాకిస్థాన్ వెళ్లడం లేదని సమాచారం.
జూలై 19న కొలంబోలో ఐసీసీ అధికారుల సమావేశం జరిగింది. నివేదిక ప్రకారం.. హైబ్రిడ్ మోడల్‌ను పరిగణించబోమని పిసిబి స్పష్టం చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుందని, దీని కోసం హైబ్రిడ్ మోడల్ అమలు చేయలేమని పిసిబి ఛైర్మన్ మొహ్సిన్ రజా నఖ్వీ ఐసిసికి స్పష్టం చేసినట్లు నివేదిక పేర్కొంది. భారత్‌ను పాకిస్తాన్‌కు తీసుకురావడం ఐసిసి పని, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కాదని నఖ్వీ అన్నట్లు సమాచారం.
Also Read: Gautam Adani: ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న అదానీ.. ఆ జట్టుపై కన్ను..!
ఇప్పటికే ప్రతిపాదిత షెడ్యూల్‌కు గ్రీన్ సిగ్నల్
కొన్ని వారాల క్రితం.. పీసీబీ పంపిన ప్రతిపాదిత షెడ్యూల్‌కు ఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ షెడ్యూల్ ప్రకారం లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో టీమిండియా అన్ని మ్యాచ్‌లు జరగనున్నాయి. ఒకవేళ భారత్ సెమీఫైనల్ లేదా ఫైనల్స్‌కు చేరితే, ఆ మ్యాచ్‌లు కూడా లాహోర్‌లో జరుగుతాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 1న చిరకాల ప్రత్యర్థి భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత్ పాకిస్థాన్‌కు రాకపోతే.. ఏం జరుగుతుందో గతంలో ఓ వార్త వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో 2026లో భారత్ ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ ఆడేందుకు పాకిస్థాన్ జట్టు కూడా రాదని ఆ వార్త సారాంశం.
We’re now on WhatsApp. Click to Join.
ఇంతకుముందు ఆసియా కప్ 2023 కూడా వివాదాస్పదంగా మారింది. దీనికి పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించింది. దీని కారణంగా శ్రీలంకలో భారత్ మ్యాచ్‌లు జరిగాయి. కానీ ఈసారి హైబ్రిడ్ మోడల్ పట్ల పీసీబీ చాలా కఠిన వైఖరిని అవలంబించింది.