HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Sourav Ganguly Comments On Ind Vs Pak Boycott

భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే పాకిస్థాన్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఐసీసీ (ICC), పీసీబీ మధ్య ప్రస్తుతం కీలక చర్చలు జరుగుతున్నాయి.

  • Author : Gopi Date : 08-02-2026 - 6:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ganguly Warns Gambhir
Ganguly Warns Gambhir

IND vs PAK Boycott: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్‌తో తలపడేందుకు పాకిస్థాన్ నిరాకరించింది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పొరుగు దేశం పేర్కొంది. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల పీసీబీ భారీ ఆర్థిక నష్టాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ వివాదంపై స్పందించారు.

బహిష్కరణ నిర్ణయంపై ‘దాదా’ ఏమన్నారంటే?

భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న పీసీబీ నిర్ణయంపై సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ నిర్ణయం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. “పాకిస్థాన్ ఇప్పటికే తన మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడుతోంది. వరల్డ్ కప్ గెలవాలనే లక్ష్యంతో వచ్చినప్పుడు ప్రతి పాయింట్ చాలా ముఖ్యం. ఇలాంటి సమయంలో పాయింట్లను వదులుకోవడం సరైనది కాదు. పీసీబీ నిర్ణయం ఆశ్చర్యకరంగా ఉంది. కానీ అది వారి బోర్డు అంతర్గత నిర్ణయం కాబట్టి మనం ఏమీ చేయలేం” అని గంగూలీ పేర్కొన్నారు.

Also Read: భారత్-పాక్ మ్యాచ్‌పై సందిగ్ధత.. బహిష్కరణ నిర్ణయంపై పీసీబీ స్పష్టత!

పాకిస్థాన్ యూ-టర్న్ తీసుకునే అవకాశం!

ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే పాకిస్థాన్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఐసీసీ (ICC), పీసీబీ మధ్య ప్రస్తుతం కీలక చర్చలు జరుగుతున్నాయి. ఐసీసీ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించడంతో ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడేందుకు పాకిస్థాన్ అంగీకరించే అవకాశం ఉంది. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా ఈ విషయంలో పునరాలోచించాలని పీసీబీకి లేఖ రాసింది. దీంతో పాకిస్థాన్ బోర్డు ప్రస్తుతం తమ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • boycott
  • ind vs pak
  • IND vs PAK Boycott
  • sourav ganguly
  • sports news

Related News

The Imran Khan-led PTI party has announced that it is boycotting the PoK elections due to the

Imran Khan: ‘స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల వాతావరణం లేకపోవడం’ కారణంగా PoK ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని PTI పార్టీ ప్రకటించింది.

ఇస్లామాబాద్ యొక్క దశాబ్దాల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, జూలై 27న జరగనున్న పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) శాసనసభ ఎన్నికలను ఇమ్రాన్ ఖాన్ యొక్క పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎన్నికల ప్రక్రియలో తాము పాల్గొనబోమని కూడా ఆ పార్టీ తెలిపింది. ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన ఈ పార్టీ ప్రతినిధి ఒక ప్రకటనలో

  • India vs. Sri Lanka Test series schedule...

    IND vs SL: ఇండియా, శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్..

  • Indian women's team announced for Asian Games

    Asian Games 2026: ఏషియన్ గేమ్స్‌కు భారత మహిళల జట్టు ప్రకటన

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd