HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Sachin Tendulkar Invites Narendra Modi To Son Arjuns Wedding

అర్జున్ టెండూల్క‌ర్‌ పెళ్లికి ప్ర‌ధాని మోదీ?!

సాన్యా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమెకు మూగజీవాలంటే చాలా ఇష్టం. ముంబైలో 'మిస్టర్ పాస్' అనే ప్రీమియం పెట్ సెలూన్, స్పాను ఆమె నడుపుతున్నారు.

  • Author : Gopi Date : 10-02-2026 - 9:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sachin Tendulkar
Sachin Tendulkar

Sachin Tendulkar: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. అర్జున్- సాన్యా చందోక్ నిశ్చితార్థం ఇప్పటికే జరగగా వీరి పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై స్వయంగా సచిన్ క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 10 (మంగళవారం) నాడు సచిన్ తన కుటుంబంతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి అర్జున్ వివాహానికి హాజరుకావాలని ఆహ్వానించారు.

ప్రధాని మోదీకి ఆహ్వానం

సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి, కుమారుడు అర్జున్, కుమార్తె సారా, కాబోయే కోడలు సాన్యా చందోక్‌తో కలిసి ప్రధాని మోదీని కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను సచిన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. “గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అర్జున్-సాన్యా వివాహానికి ఆహ్వానించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యువ జంటకు మీ ఆశీస్సులు, విలువైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు మోదీ జీ” అని రాశారు.

Also Read: న‌మీబియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్‌!

#WATCH | Delhi: Cricket legend Sachin Tendulkar leaves from 10, Janpath – the residence of Congress Parliamentary Party Chairperson Sonia Gandhi. His wife, Anjali Tendulkar is also with him. pic.twitter.com/lu9CJUMq1T

— ANI (@ANI) February 10, 2026

సోనియా గాంధీతో భేటీ

ప్రధాని కంటే ముందు సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలితో కలిసి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా కలిశారు. ఢిల్లీలోని 10 జనపథ్‌లో ఉన్న ఆమె నివాసంలో ఈ భేటీ జరిగింది.

ఎవరీ సాన్యా చందోక్?

అర్జున్ టెండూల్కర్- సాన్యా చందోక్ 2025 ఆగస్టులో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. సాన్యా ముంబైలోని ఒక ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందినవారు. వీరి కుటుంబం దశాబ్దాలుగా భారత హాస్పిటాలిటీ, ఫుడ్ ఇండస్ట్రీలో పేరుగాంచింది. సాన్యా ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘై మనవరాలు. ఘై కుటుంబం ఫైవ్ స్టార్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ వంటి పెద్ద బ్రాండ్‌లకు యజమానులు.

సాన్యా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమెకు మూగజీవాలంటే చాలా ఇష్టం. ముంబైలో ‘మిస్టర్ పాస్’ అనే ప్రీమియం పెట్ సెలూన్, స్పాను ఆమె నడుపుతున్నారు. సాన్యా టెండూల్కర్ కుటుంబానికి కూడా చాలా దగ్గరి వ్యక్తి. ఆమె సారా టెండూల్కర్‌కు ప్రాణస్నేహితురాలు. వీరిద్దరూ తరచుగా కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. మీడియా నివేదికల ప్రకారం.. అర్జున్-సాన్యాల వివాహ వేడుకలు మార్చి 3 నుండి ప్రారంభమవుతాయి. ప్రధాన వివాహ వేడుక మార్చి 5న జరగనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Arjun Tendulkar
  • india
  • New Delhi
  • pm modi
  • saaniya chandok
  • sachin tendulkar

Related News

    Latest News

    • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

    • ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

    • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

    • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

    • Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స…?

    Trending News

      • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

      • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

      • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

      • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd