India Vs New Zealand : టాస్ గెల్చి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్.. టీమిండియాలో కీలక మార్పులు
స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్‌దీప్ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను(India Vs New Zealand) తుది టీమ్‌లోకి తీసుకున్నారు.
- By Pasha Published Date - 10:10 AM, Thu - 24 October 24

India Vs New Zealand : మహారాష్ట్రలోని పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెల్చిన న్యూజిలాండ్ టీమ్ కెప్టెన్ టామ్ లేథమ్ బ్యాటింగ్‌ను ఎంచుకున్నారు. దీంతో తుది జట్టులో ఇండియా టీమ్ కీలక మార్పులు చేసింది. నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడానికి సరిపడా ప్లేయర్లు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్‌దీప్ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను(India Vs New Zealand) తుది టీమ్‌లోకి తీసుకున్నారు.
Also Read :BTech Management Seats : ఎంబీబీఎస్ తరహాలో బీటెక్ మేనేజ్మెంట్ కోటా సీట్ల కేటాయింపు ?
మూడు టెస్టుల ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన మొదటి టెస్టులో కేఎల్ రాహుల్, సిరాజ్ అంతగా రాణించలేదు. దీంతో వారిద్దరి స్థానంలో గిల్, ఆకాశ్‌దీప్‌లను టీమ్‌లోకి తీసుకున్నారు. మొత్తం మీద టీమిండియా తుది జట్టులో.. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నారు.
Also Read :Hyderabad : హైదరాబాద్‌లో మరో సొరంగ మార్గం.. ట్రాఫిక్ కష్టాలకు చెక్
న్యూజిలాండ్ టీమ్ సైతం పేసర్ మ్యాట్ హెన్రీని పక్కన పెట్టేసి మిచెల్ సాంట్నర్‌ను తీసుకుంది. కివీస్ తుది టీమ్‌లో.. టామ్ లేథమ్ (కెప్టెన్), డేవన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సౌథీ, మిచెల్ సాంట్నర్, అజాజ్ పటేల్, విలియమ్ ఒరోర్కీ ఉన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మొదటి టెస్టులో 8 వికెట్ల తేడాతో కివిస్ గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో న్యూజిలాండ్ ఉంది. భారత్ ఈ మ్యాచ్‌లో నెగ్గడం ద్వారా ప్రస్తుతానికి పాయింట్ల పట్టికను సమం చేయొచ్చు. ఒకవేళ ఇందులో ఓడిపోతే టెస్ట్ సిరీస్ కివీస్ కైవసం అవుతుంది.