HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Team India Player To Get Married Soon

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న టీమ్ ఇండియా ప్లేయర్..

  • Author : Vamsi Chowdary Korata Date : 10-03-2026 - 2:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kuldeep Yadav Marriage
Kuldeep Yadav Marriage
Kuldeep Yadav Wedding  భారత క్రికెట్ అభిమానులకు ఒకేసారి రెండు శుభవార్తలు అందాయి. ఒకటి టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించడం కాగా, రెండోది జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పెళ్లి పీటలెక్కనుండటం. ఈ రెండు వార్తలతో దేశవ్యాప్తంగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన తుది పోరులో 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది. 2024లో దక్షిణాఫ్రికాను ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన భారత్, ఇప్పుడు వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి టీ20 ఫార్మాట్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది.

ఈ ప్రపంచకప్ విజయాన్ని రెట్టింపు చేస్తూ, టీమిండియా కీలక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశికను వివాహం చేసుకోనున్నట్లు కుల్దీప్ ప్రకటించాడు. వీరి వివాహం ఈ నెల‌ 14న ముస్సోరిలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ప్రపంచకప్‌కు ముందే 2025 జూన్ 4న కుల్దీప్, వంశికల నిశ్చితార్థం లక్నోలో జరిగింది.

కుల్దీప్ కాబోయే భార్య వంశిక, కాన్పూర్‌లోని శ్యామ్ నగర్ నివాసి. ఆమె ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తున్నారు. చిన్ననాటి నుంచి మంచి స్నేహితులైన వీరిద్దరి బంధం ప్రేమగా మారింది. వివాహం అనంతరం ఈ నెల‌ 17న లక్నోలోని సెంట్రమ్ హోటల్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు పలువురు క్రికెటర్లు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కుల్దీప్ తండ్రి రామ్ సింగ్ యాదవ్, ఈ వివాహ వేడుకకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కూడా స్వయంగా ఆహ్వానించారు.

వివాహానికి ఒక రోజు ముందు, మార్చి 13న ముస్సోరిలోని ఓ రిసార్టులో మెహందీ, హల్దీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వాస్తవానికి వీరి పెళ్లి నవంబర్‌లో జరగాల్సి ఉన్నప్పటికీ, కుల్దీప్ బిజీ షెడ్యూల్ కారణంగా ప్రపంచకప్ ముగిసిన వెంటనే చేసుకోవాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2026 T20 World Cup
  • Chief Minister Yogi Adityanath
  • CM Yogi Adityanath
  • India vs New Zealand
  • indian cricket
  • indian cricket team
  • kuldeep yadav
  • Kuldeep Yadav Wedding
  • Lucknow Reception
  • Vanshika

Related News

Gautam Gambhir enjoys family time in Singapore

Gautam Gambhir: సింగపూర్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న గౌతమ్ గంభీర్

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌కు చారిత్రక విజయాన్ని అందించిన తర్వాత గౌతీ విరామం తీసుకున్నాడు. సింగపూర్‌లో తన భార్య నటాషా, కుమార్తెలు అజీన్, అనైజాతో కలిసి వెకేషన్‌ను ఆస్వాదిస్తున్నాడు. సింగపూర్ వీధుల్లో సాధారణ దుస్తుల్లో కనిపించిన గంభీర్, తన చిన్న కుమార్తెను భుజాలపై ఎక్కించుకున

    Latest News

    • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

    • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

    • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

    Trending News

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd