HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Telangana Was Not Insulted In The Lok Sabha Tdp Mp Lavu Srikrishna Devaraya Gives Clarity

లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

  • Author : Vamsi Chowdary Korata Date : 11-03-2026 - 2:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tdp Mp Lavu Sri Krishna Devarayalu
Tdp Mp Lavu Sri Krishna Devarayalu

Mp Lavu Sri Krishna Devarayalu  ఇటీవల పార్లమెంటులో ఏపీ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణను అవమానించేలా ఉన్నాయంటూ.. తెలంగాణ రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై మాట్లాడుతూ బ్లాక్ డే అంటూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వ్యవహారం కాస్తా తీవ్ర దుమారానికి కారణం కావడంతో.. ఆయన స్పందించారు. తాను తెలంగాణను అవమానించలేదని క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా ఏర్పడి 12 ఏళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడిన టీడీపీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదానికి కారణం అయ్యాయి. లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంపై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలోనే 2014 ఫిబ్రవరి 14వ తేదీని బ్లాక్ డేగా ఎంపీ లావు అభివర్ణించడంపై.. బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే తన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీయడంతో ఎట్టకేలకు ఆయన స్పందించారు.

పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై ఎక్స్‌ వేదికగా స్పందించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌.. ఏపీ ఎంపీలు తెలంగాణపై ఏడుపు ఆపాలని హెచ్చరించారు. రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు గడుస్తున్నా తెలంగాణపై ఏపీ నేతలు విషం చిమ్మడం మాత్రం ఆపడం లేదని విమర్శించారు. తెలంగాణ అస్తిత్వాన్ని లోక్‌సభ వేదికగా కించపరిచేలా ఎంపీ లావు మాట్లాడారని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఏం కావాలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అడిగే తెలివి లేక.. తెలంగాణపై పడి ఏడవడం వారికి అలవాటుగా మారిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా తెలంగాణ జోలికి వచ్చి తమ ప్రజలను అవమానించినా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కించ పరిచే విధంగా మాట్లాడితే మాత్రం తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

ఇక తెలంగాణపై తాను చేసిన వ్యాఖ్యలు ఇంతటి వివాదానికి కారణం కావడంతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ ఇచ్చారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఎంపీ లావు.. తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించలేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచేలా కూడా ఏం మాటలు మాట్లాడలేదని వివరణ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందే సమయంలో అప్పటి లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న మీరా కుమార్ తీరుపై మాత్రమే తాను మాట్లాడినట్లు చెప్పారు. ఆ సమయంలో లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ రూల్స్ అతిక్రమించేలా వ్యవహరించారని మాత్రమే తాను పేర్కొన్నట్లు క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి.. మళ్లీ తెలంగాణ, ఏపీ సెంటిమెంట్‌ను రాజేయవద్దని బీఆర్ఎస్ నేతలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Lavu Sri Krishna Devarayalu
  • lok sabha
  • MP Lavu Sri Krishna Devarayalu
  • TDP MP
  • telangana
  • Telangana Formation

Related News

Central Govt Good News2

Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 పథకం కింద రాష్ట్రంలోని 118 పట్టణ ప్రాంతాల్లో మొత్తం 18,213 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

  • Cm Revanth Key Update On Fr

    Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • New Amrit Bharat Express.

    తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

  • Tgsrtc Bus Chage

    TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు

  • Sunstroke Dies

    Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

Latest News

  • బాపు బొమ్మ-విశ్వ మహిళ అవార్డ్స్.. కొణిదెల అంజనాదేవికి తొలి పురస్కారం!

  • లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

  • FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

  • Mahesh Babu Fans : హరీష్ శంకర్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ ..ఉస్తాద్ ఓపెనింగ్స్ కు ప్రమాదమా ?

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd