HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Sharmila Counter To Jagan 2

Sharmila Strong Counter To Jagan : జగన్ సైకో మనస్తత్వానికి ఇదో నిదర్శనం – TDP

Property Issues : జగన్ సైకో మనస్తత్వానికి ఇదో నిదర్శనం - TDP

  • By Sudheer Published Date - 11:01 PM, Wed - 23 October 24
  • daily-hunt
Sharmila Letter
Sharmila Letter

జగన్ – షర్మిల మధ్య ఆస్థి తగాదాలు (Property disputes between Jagan and Sharmila) నడుస్తున్నాయని గత కొద్దీ నెలలుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తగాదాలే షర్మిల – జగన్ మధ్య దూరం పెంచాయని ప్రచారం జరిగింది. ఈ తగాదాలను దృష్టి లో పెట్టుకొని..ఎన్నికల సమయంలో జగన్ (Jagan) పై షర్మిల (Sharmila) విరుచుకుపడింది. జగన్ ఓటమి కి షర్మిల కూడా ఓ కారణమని చెప్పచ్చు. తాజాగా షర్మిల తో పాటు తన తల్లి (Vijayamma) కి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ తరుణంలో, షర్మిల జగన్‌కు రాసిన లేఖ టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేసింది. ఈ లేఖలో షర్మిల , విజయమ్మ ఏమని అన్నారంటే..

‘మీరు ఇటీవల నాకు పంపిన లేఖపై నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులన్నింటినీ తన నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని నిర్ద్వంద్వంగా ఆదేశించిన విషయం నేను మీకు గుర్తు చేస్తున్నా. మీరు ఆ షరతుకి అంగీకరిస్తున్నాని ఆ సమయంలో మాకు హామీ ఇచ్చారు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మీరు ఆ షరతుకి నేను అంగీకరించనంటూ నిరాకరించారు. భారతి సిమెంట్స్‌, సాక్షి ఇలా తన జీవితకాలంలో రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురు మనవళ్లు సమానంగా పంచుకోవాలని ఆనాడే స్పష్టంగా చెప్పారు. వీటన్నిటికీ మన అమ్మ సాక్షి మాత్రమే కాదు మన మధ్య జరిగిన పరస్పర ఒప్పందాలన్నీ గమనించింది కూడా’ అని వైఎస్‌ షర్మిల గుర్తుచేశారు.

‘మీరు ఇప్పుడు సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఒప్పందం‌ ప్రకారం మీ సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. మన తండ్రి అడుగు జాడల్లో నడవాల్సిన మీరు ఇలా దారి తప్పడం నాకు ఆశ్చర్యం వేస్తోంది’ సంయుక్త లేఖలో షర్మిల, విజయమ్మ పేర్కొన్నారు. ‘ప్రేమ, ఆప్యాయతలతో నాకు బదిలీ చేసినట్లు చేసుకున్న అవగాహన ఒప్పందం, ఎంఓయూలో పేర్కొన్న ఆస్తులు, ఇవన్నీ మన తండ్రి ఆదేశాలను పాక్షికంగా నెరవేర్చడం కోసం మాత్రమే’ అని తెలిపారు.

‘నేను పాక్షికంగా అని చెప్పడానికి కారణం సాక్షి, భారతి సిమెంట్స్‌లో మెజారిటీ వాటా నిలుపుకోవాలని మీరు పట్టుబడుతున్నారు కాబట్టి. ఇప్పటికవరకు మీదే పైచేయి కాబట్టి నన్ను పూర్తిగా తొక్కివేశారు. ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం మేము ఒక పరిష్కారానికి అంగీకరించాం. మీరు నాకు అన్నయ్య కాబట్టి, కుటుంబ వివాదాలు పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో నా సమాన వాటాను వదులుకోవడానికి అంగీకరించాన. ఆ విధంగా 31.08.2019న అమలు చేయబడిన ఒప్పందం ప్రకారం నాకు కొన్ని ఆస్తులు మాత్రమే కేటాయించబడ్డాయి’ అని షర్మిల వివరించారు.

‘ఇప్పుడు మీరు మన తండ్రి ఆదేశాలకు తూట్లు పొడుస్తూ ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. చట్టపరంగా మీ లేఖ ఎంఓయూకి విరుద్ధం దానికి ఏమాత్రం పవిత్రత లేదు. కానీ మీ లేఖ వెనుక ఉన్న దురుద్దేశం నాకు చాలా బాధ కలిగించింది. ఇది మన తండ్రి మీద మీకున్న గౌరవాన్ని తగ్గించేలా ఉంది. ఆయన ఎన్నడూ కలలో కూడా మీరు ఊహించని పని చేశారు. చట్టబద్దంగా మీ కుటుంబసభ్యులకు చెందాల్సిన ఆస్తులను లాక్కోడానికి సొంత తల్లి మీద, నా మీద కేసులు పెట్టారు’ అని షర్మిల, విజయమ్మ తెలిపారు.

"నన్ను రాజకీయంగా ఏమి అనకు, రాజకీయంగా నాకు అడ్డు రాకు, అప్పుడు నీకు ఆస్తులు రాసిస్తా…"
సొంత చెల్లి షర్మిలని బెదిరిస్తూ లేఖ రాసిన సైకో జగన్

"నన్ను రాజకీయంగా ఇబ్బందులు పెడుతుంటే, నీకు నేను ఆస్తులు ఎందుకు ఇవ్వాలి ? రాజకీయంగా నా పై విమర్శలు చేస్తున్న నీకు, నేను చిల్లి గవ్వ… pic.twitter.com/9w0tpvLsPQ

— Telugu Desam Party (@JaiTDP) October 23, 2024

జగన్ రెడ్డికి విలువలు విశ్వసనీయత లేని వాడని , లేఖలో రాసిన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ

"దివంగత నేత మన తండ్రి కోరికలను నెరవేర్చడానికి మరియు చేసుకున్న అవగాహన ఒప్పందానికి కట్టుబడి ఉండటంలో మీరు మీ నైతికతను కోల్పోయారు. మీరు దాని నుండి బయట పడతారాని ఆశిస్తున్నాను. మీరు అలా చేయకూడదని… pic.twitter.com/6Z7NfnJiis

— Telugu Desam Party (@JaiTDP) October 23, 2024

చెల్లి షర్మిల రాజకీయ జీవితం పై అసూయ, ఈర్ష్య తో, షర్మిలని రాజకీయాల నుంచి తప్పుకోవాలని జగన్ చేసిన నీచమైన ఆలోచన గురించి లేఖలో ప్రస్తావించిన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ

"నా రాజకీయ జీవితం పూర్తిగా నాకు సంబంధించింది. నా వృత్తి పరమైన జీవితాన్ని నిర్దేశించడానికి నేను మిమ్మల్ని… pic.twitter.com/gNUvf2DHSN

— Telugu Desam Party (@JaiTDP) October 23, 2024

డబ్బు కోసం, ఆస్తి కోసం, సొంత చెల్లిని కూడా జగన్ రెడ్డి ఎలా మోసం చేస్తాడో చెప్తూ, లేఖ రాసిన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ

"MOU చేసుకున్న దాని ప్రకారం కాకుండా, మీరు తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం పూర్తిగా చట్ట విరుద్ధం. 20 ఎకరాల యలహంక ఇంటి ఆస్తితో సహా, MOUలో పేర్కొన్న అన్ని ఆస్తులకు… pic.twitter.com/1QbgqoC8ns

— Telugu Desam Party (@JaiTDP) October 23, 2024

జగన్ రెడ్డికి వికృత మనస్తత్వం వివరిస్తూ, లేఖ రాసిన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ

"MOU ప్రకారం నా వాటాలో భాగంగా నాకు ఇవ్వబడిన సరస్వతి పవర్‌పై, MOU ఒప్పందంపై సంతకం చేసిన వెంటనే దాని షేర్లన్నింటినీ నాకు బదిలీ చేస్తానని మీరు హామీ ఇచ్చారు. అయితే, మీరు చాలా సంవత్సరాలుగా హామీ… pic.twitter.com/VWek6Lnocm

— Telugu Desam Party (@JaiTDP) October 23, 2024

జగన్ రెడ్డికి ఎంతటి సైకోనో చెప్తూ లేఖ రాసిన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ

"ఇప్పుడు మీరు మన తండ్రి ఆదేశాలకు తూట్లు పొడుస్తూ ఏకపక్షంగా ఎంఓయూని రద్దు చేయాలని కోరుతున్నారు. చట్టపరంగా మీ లేఖ ఎంఓయూకి విరుద్ధం దానికి ఏమాత్రం పవిత్రత లేదు. కానీ మీ లేఖ వెనుక ఉన్న దురుద్దేశం నాకు చాలా బాధ… pic.twitter.com/E9hy6imuyQ

— Telugu Desam Party (@JaiTDP) October 23, 2024

జగన్ రెడ్డికి ఆవేదనతో లేఖ రాసిన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ

"మీరు ఇప్పుడు సొంత తల్లి మీద కూడా కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎమ్‌ఓయు ప్రకారం మీ సొంత చెల్లికి చెందాల్సిన ఆస్తులు కూడా లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. మన తండ్రి అడుగు జాడల్లో నడవాల్సిన మీరు ఈ విదంగా దారి… pic.twitter.com/jl6N0iSsbI

— Telugu Desam Party (@JaiTDP) October 23, 2024

సైకో జగన్, శాడిస్ట్ రూపం గురించి లేఖ రాసిన చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ

"ప్రేమ, ఆప్యాయతలతో నాకు బదిలీ చేసినట్లు చేసుకున్న అవగాహన ఒప్పందం, (MOU)లో పేర్కొన్న ఆస్తులు, ఇవన్నీ మన తండ్రి ఆదేశాలను పాక్షికంగా నెరవేర్చడం కోసం మాత్రమే. నేను పాక్షికంగా అని చెప్పడానికి కారణం సాక్షి… pic.twitter.com/Hv4IBcVhAe

— Telugu Desam Party (@JaiTDP) October 23, 2024

చరిత్రలో ఏ పురాణం చూసినా, ఈ ప్రపంచంలో ఏ జీవిని చూసినా, తల్లి తరువాతే ఏదైనా. జంతువులకు కూడా తల్లి అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఈ కన్నీటి లేఖ చూస్తే, జంతువుల కంటే ఘోరంగా ప్రవర్తించే ఒక వింత సైకో గురించి తెలుసుకుంటారు.

ఇంటి ఆడ బిడ్డకు ఆస్తి ఇవ్వకుండా, జగన్… pic.twitter.com/2HxphVWh4s

— Telugu Desam Party (@JaiTDP) October 23, 2024

Read Also : Russia : ఐదేళ్ల తర్వాత ప్రధాని మోడీ, జీ జిన్‌పింగ్ భేటీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jagan
  • Property issues
  • sharmila
  • sharmila letter
  • TDP Tweet

Related News

    Latest News

    • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd