Kumar Sangakkara: కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా సంగక్కర..?
సంగక్కర కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా మారడానికి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. సంగక్కర కేకేఆర్‌కు మెంటార్‌గా మారితే.. గౌతమ్ గంభీర్ స్థానాన్ని భర్తీ చేసినట్లే అవుతోంది.
- By Gopichand Published Date - 09:51 AM, Fri - 6 September 24

Kumar Sangakkara: ఐపీఎల్ 2025కి ముందు జట్లలో ఆటగాళ్ల పరంగానే కాకుండా కోచింగ్ స్టాఫ్ రూపంలో కూడా పెద్ద మార్పులు కనిపిస్తాయి. మెగా వేలానికి ముందు ఆటగాళ్ళు ఒక జట్టు నుండి మరొక జట్టుకు మారవచ్చు. అదేవిధంగా కోచింగ్ సిబ్బంది కూడా ఒక జట్టు నుండి మరొక జట్టుకు మారవచ్చు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)లో గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) స్థానంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్ కుమార సంగక్కర (Kumar Sangakkara) రావచ్చని ఇప్పుడు వార్తలు వచ్చాయి.
కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) మెంటార్‌గా శ్రీలంక మాజీ క్రికెటర్ సంగక్కర నియామకం కానున్నట్లు క్రీడావర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా ఉన్నారు. ఆ జట్టు ద్రవిడ్‌ను కోచ్‌గా తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో KKR యాజమాన్యం సంగక్కరతో చర్చలు జరిపినట్లు సమాచారం. గత సీజన్‌లో KKR మెంటార్‌గా ఉన్న గంభీర్ ప్రస్తుతం IND హెడ్ కోచ్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Court Notices To KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు కోర్టు నోటీసులు.. ఫామ్ హౌజ్‌లో పూజలు..!
స్పోర్ట్స్ టుడే నివేదిక ప్రకారం.. సంగక్కర కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా మారడానికి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. సంగక్కర కేకేఆర్‌కు మెంటార్‌గా మారితే.. గౌతమ్ గంభీర్ స్థానాన్ని భర్తీ చేసినట్లే అవుతోంది. టీమ్ ఇండియా ప్రధాన కోచ్ అయిన తర్వాత గంభీర్ KKR నుండి తప్పుకోవాల్సి వచ్చింది. 2024లో గంభీర్ కోల్‌కతాకు మెంటార్‌గా కనిపించాడు. ఇప్పుడు 2025లో కుమార్ సంగకర్‌ని KKR మెంటార్‌గా చూడవచ్చని తెలుస్తోంది.
శ్రీలంక మాజీ బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర రాజస్థాన్ రాయల్స్‌తో విడిపోవాలని, ఇతర జట్ల నుండి ఆఫర్‌లను చూడాలనుకుంటున్నట్లు నివేదిక వెల్లడించింది. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. అసలు అలాంటి మార్పు జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
2024లో రాజస్థాన్ రాయల్స్ ప్రదర్శన బాగానే ఉంది
రాజస్థాన్ రాయల్స్ IPL 2024లో మంచి ప్రదర్శన చేసి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. 14 మ్యాచ్‌ల్లో 8 గెలిచి మూడో స్థానంలో నిలిచింది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఆ జట్టు ఓడిపోవాల్సి వచ్చింది. క్వాలిఫయర్స్‌కు ముందు ఆ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. బెంగళూరుపై రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.