HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Is Tilak Varma Doubtful For The World Cup

వరల్డ్ కప్‌కు తిలక్ వర్మ డౌట్ ?

  • Author : Vamsi Chowdary Korata Date : 10-01-2026 - 5:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tilak Varma
Tilak Varma

Tilak Varma గతేడాది ఆసియా కప్‌లో అదరగొట్టిన తిలక్ వర్మ గాయంతో న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ 2026లోనూ.. తిలక్ వర్మ తొలి ఒకట్రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో శుభ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్‌ అయ్యర్‌ పేర్లు వినిపిస్తున్నాయి.

  • సర్జరీతో న్యూజిలాండ్ సిరీస్‌కు తిలక్ వర్మ దూరం
  • టీ20 వరల్డ్ కప్‌లోనూ అందుబాటులో ఉండడని అనుమానాలు
  • అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై సర్వత్రా చర్చ

ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా స్టార్ తిలక్ వర్మ.. గాయంతో న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్ తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. జనవరి 21 నుంచి నాగ్‌పూర్ వేదికగా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. అయితే మూడు మ్యాచ్‌లే కాకుండా.. మొత్తం సిరీస్‌లో కూడా తిలక్ వర్మ అందుబాటులో ఉండడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మరోవార్త క్రికెట్ అభిమానులను కలవరపాటుకు గరి చేస్తోంది. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్‌ కప్‌లోనూ ప్రారంభంలో జరిగే ఒకట్రెండు మ్యాచ్‌లకు తిలక్ వర్మ దూరమవుతాడనే అనుమానాలు మొదలయ్యాయి. దీంతో తిలక్ వర్మ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది.

గతేడాది జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో తిలక్‌ వర్మ అద్భుత ఇన్నింగ్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లోనూ తిలక్‌ ఆకట్టుకున్నాడు. అయితే అనూహ్యంగా వృషణాల శస్త్రచికిత్స (testicular torsion) తర్వాత జట్టుకు దూరమయ్యాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు అతడి లభ్యతను.. వైద్య బృందం పర్యవేక్షణ ఆధారంగా నిర్ణయిస్తామని బీసీసీఐ చెప్పింది. ఇది ఒకరకంగా టీమిండియాకు దెబ్బే. దీంతో అతడి స్థానంలో ఎవరు జట్టులోకి వస్తారు అనే విషయం ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో శుభ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్‌ అయ్యర్‌ వంటి ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి.

తిలక్ వర్మ ప్లేస్‌లో ఎవరు?

ఫామ్ మీద విమర్శలతో శుభ్‌మన్‌ గిల్‌ను టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేయలేదు. న్యూజిలాండ్‌ సిరీస్‌కూ అతడిని తీసుకోలేదు. దీంతో గిల్‌ను తిరిగి టీ20 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకుంటారా అన్నది సందేహమే. ఇక యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ పేరు కూడా చర్చకు వస్తోంది. అయితే టీ20 వరల్డ్ కప్‌లో అభిషేక్‌ శర్మకు తోడుగా.. సంజు శాంసన్‌ ఓపెనర్‌గా ఖరారయ్యాడు. ఈ నేపథ్యంలో యశస్విని కూడా జట్టులోకి ఎంపిక చేస్తారా అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇటీవల గాయం నుంచి కోలుకున్న స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకుంటారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తిలక్‌ స్థానంలో మిడిలార్డర్లో ఆడే బ్యాటర్‌ అవసరం కాబట్టి.. ఇతడిని సరైన రిప్లేస్‌మెంట్ అవుతాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శ్రేయాస్‌ అయ్యర్‌కు ఐపీఎల్‌లో మంచి రికార్టు ఉంది. వన్డేల్లో కూడా బాగా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకుని జట్టులోకి పునరాగమనం చేసిన అయ్యర్.. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆడనున్నాయి. ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన చేస్తే వరల్డ్ కప్ జట్టులోకి ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • cricket news
  • ICC T20 world cup
  • injured
  • sports news
  • team india
  • Telugu Cricket News
  • Telugu Sports News
  • Tilak Varma

Related News

Rishabh Pant

టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

ప్రస్తుతానికి వన్డేల్లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ మొదటి ప్రాధాన్యతగా ఉండగా పంత్ బ్యాకప్‌గా జట్టులో ఉన్నారు.

  • Team India

    న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌.. టీమిండియా జ‌ట్టు ఇదేనా!

  • Virat Kohli

    నెట్స్‌లో సందడి చేసిన విరాట్ కోహ్లీ.. అర్ష్‌దీప్ సింగ్‌ను అనుకరిస్తూ నవ్వులు పూయించిన కింగ్!

  • Bangladesh

    బంగ్లాదేశ్ క్రికెటర్లకు భారీ దెబ్బ.. భారతీయ కంపెనీ కీలక నిర్ణయం!

  • Chahal- Dhanashree

    చాహ‌ల్‌ను విడాకుల త‌ర్వాత క‌ల‌వ‌నున్న ధ‌న‌శ్రీ వ‌ర్మ‌?!

Latest News

  • రాత్రి నెయ్యితో పాలు తాగితే ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..!

  • తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన పోటీ

  • ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేకుండా..ఎయిర్‌టెల్ ఆకర్షణీయమైన ఆఫర్‌

  • తారిఖ్‌ రహ్మాన్‌ చేతికి బీఎన్‌పీ పగ్గాలు

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా..?: పరిష్కారాలు ఇవే..!

Trending News

    • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd