Kumble Prediction: న్యూజిలాండ్‌ను హెచ్చరించిన అనిల్ కుంబ్లే.. టీమిండియా ప్లాన్ ఇదేనా..?
భారత బ్యాట్స్‌మెన్ ఎలా బ్యాటింగ్ చేస్తారో నాకు తెలుసు. ఒకవేళ 150 లేదా 175 పరుగుల ఆధిక్యం సాధిస్తే న్యూజిలాండ్ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతుంది.
- By Gopichand Published Date - 09:48 AM, Sat - 19 October 24

Kumble Prediction: బెంగళూరు టెస్టులో భారత్-న్యూజిలాండ్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. మ్యాచ్ మూడో రోజు భారత్ 46 పరుగులకు సమాధానంగా న్యూజిలాండ్ 402 పరుగులు చేసి 356 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంత ఆధిక్యం సాధించిన తర్వాత మ్యాచ్ తమ ఆధీనంలో పడినట్లే అనుకుంటుంది. కానీ భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ధీటుగా బ్యాటింగ్ చేయడంతో మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్లకు 231 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం 125 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. టీమిండియా బ్యాటింగ్ చూసిన భారత గ్రేట్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (Kumble Prediction) న్యూజిలాండ్‌ను హెచ్చరించాడు.
తొలి సెషన్‌లో భారత్ ఆధిక్యం సాధించగలదు
జియో సినిమాతో కుంబ్లే మాట్లాడుతూ.. మ్యాచ్ నాల్గవ రోజు లంచ్ విరామానికి ముందు న్యూజిలాండ్ జట్టుపై భారత్ ఆధిక్యం సాధించగలదు. 150 లేదా అంతకంటే ఎక్కువ ఆధిక్యం సాధించడంలో టీమ్ ఇండియా విజయవంతమైతే, ఈ మ్యాచ్ ఎలాగైనా సాగవచ్చు. 125 పరుగుల కంటే ఎక్కువ ఆధిక్యం సాధించడంలో భారత్ విజయవంతమైతే అది కివీ జట్టుపై ఒత్తిడిని పెంచుతుందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.
భారత బ్యాట్స్‌మెన్ ఎలా బ్యాటింగ్ చేస్తారో నాకు తెలుసు. ఒకవేళ 150 లేదా 175 పరుగుల ఆధిక్యం సాధిస్తే న్యూజిలాండ్ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమవుతుంది. అప్పుడు న్యూజిలాండ్ పై ఒత్తిడిని పెంచుతుంది. ఇది ఆ జట్టుకు సమస్యలను కలిగిస్తుంది. భారతదేశం దీనిని సద్వినియోగం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను అని కుంబ్లే పేర్కొన్నాడు.
Also Read: Vistara Flight: విస్తారా విమానానికి బాంబు బెదిరింపు.. సురక్షితంగా ల్యాండ్!
మూడో రోజు ఆట ప్రారంభంలోనే న్యూజిలాండ్ తరఫున రచిన్ రవీంద్ర సెంచరీ సాధించి జట్టు స్కోరును 400 దాటించాడు. రవీంద్ర 157 బంతుల్లో 13 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో పటిష్టంగా బ్యాటింగ్ చేసి మూడు వికెట్లకు 231 పరుగులు చేసింది. జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ కంటే 125 పరుగులు వెనుకబడి ఉంది. ఏడు వికెట్లు మిగిలి ఉన్నాయి. జట్టు తరఫున విరాట్ కోహ్లీ 70 పరుగులతో ఇన్నింగ్స్ ఆడగా, సర్ఫరాజ్ ఖాన్ 70 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.