IND vs ENG 2nd Test: రెండు టెస్టులో టీమిండియాకు విజయావకాశాలు
తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైన టీమిండియా రెండో టెస్టులో సత్తా చాటేందుకు సిద్దమవుతుంది. విశాఖ వేదికగా రేపటి నుంచి భారత్– ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇందుకు సంబందించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
- By Praveen Aluthuru Published Date - 10:10 PM, Thu - 1 February 24

IND vs ENG 2nd Test: తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైన టీమిండియా రెండో టెస్టులో సత్తా చాటేందుకు సిద్దమవుతుంది. విశాఖ వేదికగా రేపటి నుంచి భారత్– ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇందుకు సంబందించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
రెండో టెస్టు రేపటి నుంచి ఆరో తేదీ వరకు జరగనుంది. తొలి టెస్టులో భారత జట్టు ఓటమిపాలు కావడంతో రెండో టెస్ట్ భారత జట్టుకు కీలకంగా మారింది. దీంతో ఈ టెస్టు చూసేందుకు వేల సంఖ్యలో అభిమానుల అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో 15 వేలు, ఆఫ్‌లైన్‌లో 5 వేల వరకు టికెట్లు విక్రయించినట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉండగా విశాఖలో టీమిండియా ఒక్కసారి కూడా ఓడింది లేదు.
2016లో ఇంగ్లండ్ ని భారత్ చిత్తూ చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ 246 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులు చేశాడు. ఇదే పిచ్ పై భారత్ చివరిసారిగా 2019లో దక్షిణాఫ్రికాతో తలపడింది. ఈ టెస్టులో భారత్ 206 పరుగులతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు నమోదు చేశాడు. 2 ఇన్నింగ్స్‌లలో 77.09 స్ట్రైక్ రేట్‌తో 303 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ 244 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 176 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 149 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 127 పరుగులు చేశాడు. అంతేకాదు విశాఖపట్నం పిచ్ పై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిలిచాడు. విరాట్ కోహ్లీ 299 పరుగులతో రెండో స్థానంలో ఉండగా మయాంక్ అగర్వాల్ 222 పరుగులతో మూడో స్థానంలో, ఛెతేశ్వర్ పుజారా 207 పరుగులు చేసి నాలుగో స్థానంలో, అజింక్యా రహానే 91 పరుగులతో 5వ స్థానంలో ఉన్నారు.
Also Read: Vastu Tips for Tulsi: తులసి ఆకులను తుంచడానికి నియమాలు పాటించాలని మీకు తెలుసా?