విరాట్ కోహ్లీ ముందున్న రెండు భారీ రికార్డులివే!
న్యూజిలాండ్‌పై వన్డేల్లో భారత్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచేందుకు కోహ్లీకి ఇది మంచి అవకాశం. ప్రస్తుతం కోహ్లీ, సెహ్వాగ్ ఇద్దరూ చెరో 6 సెంచరీలతో సమానంగా ఉన్నారు.
- Author : Gopichand
Date : 13-01-2026 - 5:55 IST
Published By : Hashtagu Telugu Desk
King Kohli: వన్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్ ప్రస్తుతం పరుగుల వరద పారిస్తోంది. గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు బాది భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో కూడా 93 పరుగులతో అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాజ్‌కోట్‌లో జరగనున్న రెండో వన్డేలో కోహ్లీ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్ వంటి దిగ్గజాల రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది.
కింగ్ కోహ్లీ ముందున్న 2 భారీ రికార్డులు
వన్డే క్రికెట్ చరిత్రలో వరుసగా ఐదు మ్యాచుల్లో 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఘనత కోహ్లీకి ఇప్పటివరకు 5 సార్లు దక్కింది. ఈ జాబితాలో కోహ్లీ ప్రస్తుతం సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్‌లతో కలిసి సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నాడు. రెండో వన్డేలో కూడా కోహ్లీ హాఫ్ సెంచరీ చేస్తే వీరిందరినీ వెనక్కి నెట్టి ఈ ఘనతను 6వ సారి సాధించిన ఏకైక భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు.
Also Read: క్రికెటర్ సూర్యకుమార్‌పై ఖుషీ ముఖర్జీ ఆరోపణలు.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావా!
న్యూజిలాండ్‌పై వన్డేల్లో భారత్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచేందుకు కోహ్లీకి ఇది మంచి అవకాశం. ప్రస్తుతం కోహ్లీ, సెహ్వాగ్ ఇద్దరూ చెరో 6 సెంచరీలతో సమానంగా ఉన్నారు. వడోదరలో జరిగిన మొదటి వన్డేలో కోహ్లీ కేవలం 7 పరుగుల దూరంలో సెంచరీ మిస్ అయ్యాడు. రాజ్‌కోట్‌లో సెంచరీ బాదితే సెహ్వాగ్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంటాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. వడోదరలో జరిగిన తొలి పోరులో టీమ్ ఇండియా ప్రదర్శన అద్భుతంగా సాగింది.