HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Class 10 Student Writes Exam With Oxygen Cylinder

ఆక్సిజన్‌ సిలిండర్‌తోనే.. పరీక్ష రాసిన పదోతరగతి విద్యార్థి

  • Author : Vamsi Chowdary Korata Date : 17-03-2026 - 2:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap 10th Class Exams
Ap 10th Class Exams

ఏపీలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షల తొలిరోజే రెండు భిన్నమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకచోట ప్రాణాలతో పోరాడుతున్న విద్యార్థి పట్టుదల స్ఫూర్తి నింపగా, మరోచోట పరీక్షల విధుల్లో ఉన్న ఓ ప్రధానోపాధ్యాయుడు గుండెపోటుతో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ రెండు సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

ఆక్సిజన్ సిలిండర్‌తో పరీక్ష రాసిన విద్యార్థి
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పాదర్తికి చెందిన కట్టా కౌశిక్‌చంద్‌ అనే విద్యార్థి తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడికి, ఊపిరితిత్తుల మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. అయితే, శస్త్రచికిత్సకు రూ.50 లక్షలకు పైగా ఖర్చవుతుందని, అంత స్థోమత తమకు లేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటి వద్దనే తాత్కాలిక వైద్యం అందిస్తున్నారు.

అయినా ఏమాత్రం వెనకడుగు వేయని కౌశిక్‌, ఎలాగైనా పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు. అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి పొంది, కొత్తపట్నం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రానికి ఆక్సిజన్ సిలిండర్‌తో హాజరయ్యాడు. ముక్కుకు మాస్క్ పెట్టుకుని ఆక్సిజన్ తీసుకుంటూనే తెలుగు పరీక్ష రాసి తన అకుంఠిత దీక్షను చాటుకున్నాడు. అతని పట్టుదల అందరినీ కదిలించింది.

పరీక్షా కేంద్రంలోనే కుప్పకూలిన హెడ్ మాస్టర్
కర్నూలు జిల్లాలో జరిగిన మరో ఘటన అందరినీ కలచివేసింది. నిడ్జూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన షేక్‌ అన్వర్‌బాషా, మాధవనగర్‌లోని ఓ పాఠశాలలో పదో తరగతి పరీక్షా కేంద్రానికి చీఫ్‌ సూపరింటెండెంట్‌గా విధులకు హాజరయ్యారు. సోమవారం ఉదయం విధి నిర్వహణలో ఉండగానే ఆయనకు తీవ్రమైన గుండెనొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే సిబ్బంది ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. అన్వర్‌బాషాకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన భార్య కూడా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అన్వర్‌బాషా అకాల మరణంతో తోటి ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap education
  • AP Exams
  • AP SSC Exams
  • Class 10 Exams
  • Headmaster death
  • heart attack
  • Oxygen Cylinder

Related News

South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌తో భేటీ అయ్యారు. క్రీడల్లో తన అభిరుచి, క్రమశిక్షణ, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాల క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన జాంటీ రోడ్స్‌ను కలవడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ భేటీలో క్రీడలు, యువత అభివృద్ధ

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

  • MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

    TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

  • Village development in AP: Centre allocates Rs 16,627 crore.

    ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

Latest News

  • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

  • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

  • Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

  • Vedanta Power : స్టాక్ మార్కెట్లోకి వేదాంత పవర్ ఎంట్రీ

  • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd