HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Indias T20 World Cup Hero Likely To Captain Sunrisers Hyderabad

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నాయకత్వం వహించనున్నాడు.

  • Author : Gopi Date : 17-03-2026 - 3:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ishan Kishan
Ishan Kishan

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుండి ప్రారంభం కానుంది. 19వ సీజన్ తొలి పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడనున్నాయి. అయితే టోర్నమెంట్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీ సారథ్యం కోసం ఒక కొత్త పేరు తెరపైకి వచ్చింది. అభిషేక్ శర్మను కాదని, టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన ఆ 27 ఏళ్ల యువ ఆటగాడు సన్‌రైజర్స్ కెప్టెన్ కాబోతున్నాడు.

SRH కొత్త సారథిగా ఇషాన్!

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నాయకత్వం వహించనున్నాడు. ఇషాన్ కెప్టెన్సీ అనుభవం విషయానికి వస్తే ఇటీవల ఆయన నాయకత్వంలో జార్ఖండ్ జట్టు తన తొలి ‘సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ’ని గెలుచుకుంది. ఆ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా ఇషాన్ నిలిచాడు. SRH కెప్టెన్సీ రేసులో అభిషేక్ శర్మ పేరు కూడా వినిపించినప్పటికీ ఇషాన్ వారందరినీ వెనక్కి నెట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా అభిషేక్ శర్మ ప్రస్తుతం పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: విజయ్–త్రిష రూమర్స్‌ పై ఖుష్బూ సుందర్ షాకింగ్ కామెంట్స్!

టీ20 ప్రపంచకప్ 2026లో అద్భుత ప్రదర్శన

దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమ్ ఇండియాలోకి పునరాగమనం చేసిన ఇషాన్ కిషన్ టీ20 ప్రపంచకప్ 2026లో అదరగొట్టాడు. టోర్నీ ఆద్యంతం అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగిన ఇషాన్ భారత్ తరపున రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.

  • మ్యాచ్‌లు: 9
  • పరుగులు: 317
  • స్ట్రైక్ రేట్: 193
  • సిక్సర్లు: 18

గత సీజన్‌లో సన్‌రైజర్స్ జట్టులోకి చేరిన ఇషాన్ 13 ఇన్నింగ్స్‌ల్లో 35.40 సగటుతో 354 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ కూడా ఉన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL 2026
  • ishan kishan
  • sports news
  • SRH
  • Sunrisers Hyderabad

Related News

Virat Kohli

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు!

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మంచి ఆరంభం లభించింది.

  • SRH vs LSG

    స‌న్‌రైజ‌ర్స్‌ను చిత్తు చేసిన ల‌క్నో!

  • RCB vs CSK

    చెన్నై బోణీ కొడుతుందా? ఆర్సీబీ- సీఎస్కేల‌లో ఎవ‌రిది పైచేయి?

  • Hardik Pandya

    ముంబై ఇండియ‌న్స్‌కు గుడ్ న్యూస్‌!

  • Tushar Deshpande

    రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్.. చివరి బంతి వరకు ఉత్కంఠ!

Latest News

  • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

  • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

  • TG CM Vs Kerala CM : తెలంగాణ సీఎం రేవంత్ కు విజయన్ కౌంటర్

  • David Warner Arrest : డేవిడ్ వార్నర్ అరెస్ట్..ఏంచేసాడో తెలుసా ?

  • Lockdown : పాకిస్థాన్లో లాక్డౌన్..!

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd