HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Khushbu Sundars Shocking Comments On Vijay Trisha Rumors

విజయ్–త్రిష రూమర్స్‌ పై ఖుష్బూ సుందర్ షాకింగ్ కామెంట్స్!

  • Author : Vamsi Chowdary Korata Date : 17-03-2026 - 3:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Khushbu Sundar comes out in support of Trisha
Khushbu Sundar comes out in support of Trisha

Khushbu Sundar  తమిళ స్టార్ హీరో, ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ అధినేత విజయ్, ప్రముఖ నటి త్రిషల వ్యక్తిగత జీవితంపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సీనియర్ నటి ఖుష్బూ సుందర్ తీవ్రంగా స్పందించారు. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి, అసత్య ప్రచారాలు చేసే వారిపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రూమర్స్ సృష్టిస్తున్న వారి తీరును ఆమె తప్పుబట్టారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఖుష్బూ… “విజయ్, త్రిష ఇద్దరూ నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు. ముఖ్యంగా త్రిష గురించి చెప్పాలంటే, నేను చూసిన గొప్ప మహిళల్లో ఆమె ఒకరు. ఆమె చాలా మృదుస్వభావి, ఎంతో హుందాగా ప్రవర్తిస్తారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మహిళపై అనవసరంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం చాలా బాధాకరం” అని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకరు తుమ్మినా కూడా దాన్ని విమర్శించే దుస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

రూమర్స్ సృష్టించే వారి మ‌న‌స్తత్వంపై ఖుష్బూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “కొందరు ఇతరుల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తితో వారి గురించి తప్పుగా మాట్లాడుతూ ఒక రకమైన పైశాచిక ఆనందం పొందుతున్నారు. సెలబ్రిటీల ప్రైవసీకి భంగం కలిగించే ఈ సంస్కృతి ఇప్పుడు చెన్నైలో కూడా ఎక్కువ కావడం విచారకరం” అని ఆమె విమర్శించారు. ఇలాంటి కామెంట్లు చేసే వారిలో చాలా మంది అనామకులేనని, వారి మాటలను పట్టించుకుని విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని త్రిషకు సూచించారు.

విజయ్ రాజకీయ రంగ ప్రవేశం నేపథ్యంలో ఈ రూమర్స్ ఆయన కెరీర్‌పై ప్రభావం చూపుతాయా అన్న ప్రశ్నకు కూడా ఖుష్బూ స్పందించారు. “ప్రజలకు ఎవరికి ఓటు వేయాలో బాగా తెలుసు. ఒక నాయకుడి వ్యక్తిగత జీవితాన్ని, రాజకీయాలను ముడిపెట్టడం సరైన పద్ధతి కాదు. ఇది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం. దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు” అని స్పష్టం చేశారు. సెలబ్రిటీల గురించి రూమర్స్ రావడం సహజమే అయినా, అవి వారి గౌరవానికి భంగం కలిగించేలా ఉండకూడదని ఆమె హితవు పలికారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Celebrity Gossip
  • Khushbu Sundar
  • Kollywood
  • Kollywood Rumors
  • Political Impact
  • Social Media Abuse
  • Tamil cinema
  • Tamilaga Vettri Kazhagam
  • Tamilaga Vettri Kazhagam (TVK)
  • Tamilaga Vettri Kazhagam party
  • Trisha Krishnan
  • Vijay thalapathy
  • Vijay Thalapathy TVK Party
  • Vijay Trisha

Related News

    Latest News

    • Kuwait desalination plant: ఇరాన్ దాడి తర్వాత కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం..

    • Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద దాడికి గల 4 కారణాలు ఇవే

    • SSRajamouli: వారణాసి సినిమాలో పీవీ సింధు

    • Anurag Dhankar: పోలీసు ప్రధాన కార్యాలయంలో త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ మృతి

    • Rohit Sharma: రిటైర్మెంట్ పై మౌనం వీడిన రోహిత్ శర్మ: ‘నేను వెళ్ళిపోవడం లేదు…

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd