IPL 2025: రోహిత్ కోసం వేచి చూస్తున్న ఆ మూడు ఫ్రాంచైజీలు
వచ్చే ఐపీఎల్ సీజన్లో హిట్ మ్యాన్ మరో జట్టుకి ప్రాతినిధ్యం వహించబోతున్నట్లు తెలుస్తుంది. సమాచారం ప్రకారం రోహిత్ కోసం మూడు జట్లు రెడీగా ఉన్నాయట. గత ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ట్రోఫీని గెలుచుకుంది. జట్టుకు సారథి శ్రేయాస్ అయ్యర్ అయినప్పటికీ, విజయం క్రెడిట్ అంతా మెంటర్ గౌతమ్ గంభీర్‌కే చెందింది.
- By Praveen Aluthuru Published Date - 09:10 PM, Tue - 18 June 24

IPL 2025: ఐపీఎల్ లో కింగ్ మేకర్ గా ఎదిగిన రోహిత్ శర్మ గత ఎడిషన్ లో ముంబై యాజమాన్యం చేతిలో ఘోర అవమానం పాలయ్యాడు. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండానే అతడిని కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పించింది ముంబై. హార్దిక్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటికీ ఫ్యాన్స్ దాన్ని ఏ మాత్రం యాక్సెప్ట్ చెయ్యలేదు. ఫలితంగా మైదానంలోనే హార్దిక్ ట్రోలింగ్ కు గురి కావాల్సి వచ్చింది. ఏదేమైనప్పటికీ గత ఎడిషన్ లో ముంబై దారుణ ఓటమి చవిచూసింది. ఒకప్పుడు కప్పుల మీద కప్పులు గెలిచిన ముంబై ఈ ఏడాది ఐపీఎల్ లో మాత్రం లీగ్ దశలోనే వెనుదిరిగింది. దీంతో హార్దిక్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. అటు రోహిత్ ని మళ్ళీ కెప్టెన్ చేయాలనీ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కానీ రోహిత్ మళ్ళీ ముంబైకి సారధ్యం వహించేందుకు ఆసక్తి చూపించడం లేదు.
వచ్చే ఐపీఎల్ సీజన్లో హిట్ మ్యాన్ మరో జట్టుకి ప్రాతినిధ్యం వహించబోతున్నట్లు తెలుస్తుంది. సమాచారం ప్రకారం రోహిత్ కోసం మూడు జట్లు రెడీగా ఉన్నాయట. గత ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ట్రోఫీని గెలుచుకుంది. జట్టుకు సారథి శ్రేయాస్ అయ్యర్ అయినప్పటికీ, విజయం క్రెడిట్ అంతా మెంటర్ గౌతమ్ గంభీర్‌కే చెందింది. ఐతే గంభీర్ కింద అయ్యర్ కేవలం ఫీల్డ్ కెప్టెన్‌గా మాత్రమే పనిచేశారని అనడం కరెక్ట్ కాదు. జట్టు విజయంలో అయ్యర్ కీ రోల్ ప్లే చేశాడని చెప్పొచ్చు. అయితే అన్ని కుదిరితే వచ్చే ఎడిషన్ లో కేకేఆర్ కు రోహిత్ ను కెప్టెన్ చేయాలనీ ఆ జట్టు యాజమాన్యం ఆరాటపడుతోందట. ఇప్పటినుంచి ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. గంభీర్ కూడా రోహిత్ ను కేకేఆర్ లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
రీ ఎంట్రీలో రిషబ్ పంత్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీని అప్పగించారు. కానీ ఢిల్లీ ప్రదర్శనలో పెద్దగా తేడా లేకపోవడంతో ఆ జట్టు టైటిల్ ఖాతా తెరవలేకపోయింది. అందుకే ముంబైకి 5 సార్లు ట్రోఫీని అందించిన రోహిత్ ను ఢిల్లీ లాగేసుకోవాలనుకుంటుంది. రోహిత్ ఢిల్లీలో భాగమైతే ఢిల్లీ చాన్నాళ్ల టైటిల్ కల నిరవేరడం పక్క అంటున్నారు. సీనియర్ ఆటగాళ్లను చేర్చుకోవడంలో చెన్నై సూపర్ కింగ్స్ ముందుంటుంది. రోహిత్ శర్మ ముంబైని విడిచిపెడితే హిట్‌మ్యాన్‌ను చెన్నై వదులుకునే అవకాశం లేదు. గత సీజన్‌లో ధోనీ జట్టు కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. అయితే వచ్చే సీజన్ లో ధోనీ ఆడటంపై ఇంకా స్పష్టత లేదు. కాబట్టి ధోనీ స్థానంలో రోహిత్ చెన్నైని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందంటున్నారు సిఎస్కె వర్గాలు.
Also Read: GHMC Scam: జీహెచ్‌ఎంసీలో సరికొత్త కుంభకోణం