BCCI Meeting IPL Owners: ఐపీఎల్ జట్ల యజమానులతో బీసీసీఐ సమావేశం.. మెగా వేలం ఉంటుందా..? లేదా..?
మెగా వేలాన్ని నేరుగా వ్యతిరేకించిన వారిలో కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ ఉన్నారు.
- By Gopichand Published Date - 08:33 AM, Thu - 1 August 24

BCCI Meeting IPL Owners: జూలై 31న ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. ఇందులో మెగా వేలం నుంచి నిలుపుదల నిబంధనలతో పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్, పంజాబ్ కింగ్స్ సహ యజమాని నెస్ వాడియా కూడా హాజరయ్యారు. కొంతమంది యజమానులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. బిసిసిఐ అధికారికంగా (BCCI Meeting IPL Owners) ఎటువంటి ధృవీకరణ చేయనప్పటికీ ఈ సమావేశంలో ఏమి జరిగిందో..? ఏ నిర్ణయాలను పరిశీలించారో తెలుసుకుందాం.
IPL 2025 మెగా వేలం ఉంటుందా లేదా?
BCCI.. జట్టు యజమానుల మధ్య జరిగిన సమావేశంలో అత్యంత ముఖ్యమైన సమస్య IPL 2025 మెగా వేలం. Cricbuzz నివేదిక ప్రకారం.. మెగా వేలాన్ని నేరుగా వ్యతిరేకించిన వారిలో కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుక్ ఖాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ ఉన్నారు. KKR, SRH వరుసగా IPL 2024 విజేత.. రన్నర్-అప్ జట్లు. కానీ ఇప్పటి వరకు BCCI ఈ జట్ల అభిప్రాయాలపై ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు.
Also Read: LPG Prices: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన సిలిండర్ ధరలు..!
కావ్య మారన్ నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తూ మాట్టాడినట్లు సమాచారం. బలమైన జట్టును రూపొందించడానికి చాలా సమయం పడుతుంది. పరిణతి చెందిన యువ ఆటగాళ్లకు చాలా సమయం, పెట్టుబడి పెట్టాలి. అభిషేక్ శర్మ తన ప్రదర్శనలో నిలకడను తీసుకురావడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఇలాంటి ఉదాహరణలు ఇతర టీమ్‌లలో కూడా కనిపిస్తాయని మీరందరూ నాతో ఏకీభవిస్తారని అనుకుంటున్నానని కావ్య అన్నట్లు తెలుస్తోంది.
నిలుపుదల నిబంధనలపై ఈ సమావేశంలో చాలా చర్చ జరిగింది. KKR యజమాని షారుక్ ఖాన్ పంజాబ్ కింగ్స్ సహ యజమాని నెస్ వాడియాతో రిటెన్షన్ నిబంధనలపై గొడవ పడ్డారని కూడా ఒక వార్త వచ్చింది. ఒకవైపు ఎక్కువ మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అన్ని ఫ్రాంచైజీలను అనుమతించాలని షారుక్ కోరుతుండగా, తక్కువ ఆటగాళ్లను రిటైన్ చేయాలనే నిబంధనకు నెస్ వాడియా మద్దతు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం.. IPL 2025 మెగా వేలంలో కేవలం 3-4 మంది ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోవడానికి జట్లకు అనుమతి ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join.