HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >3 Teams That Might Target Mohammed Shami In Ipl 2025 Auction

Mohammed Shami: వేలంలో షమీ కోసం పోటీ పడే జట్లు ఇవేనా?

షమీని టార్గెట్ చేస్తున్న జట్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుంది. నిజానికి షమీ ఐపీఎల్ కెరీర్‌ కేకేఆర్‌తోనే ప్రారంభించాడు. అయితే కేవలం ఒక సీజన్ మాత్రమే కేకేఆర్ తరుపున ఆడాడు.

  • Author : Gopi Date : 20-11-2024 - 1:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mohammed Shami
Mohammed Shami

Mohammed Shami: మెగా వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని (Mohammed Shami) విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఫాస్ట్ బౌలర్ 2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి వచ్చాడు. షమీ కోసం వేలంలో భారీగా బిడ్డింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. గాయం నుంచి కోలుకున్న షమీ తాజాగా 7 వికెట్లతో సత్తా చాటాడు. రంజిలో బెంగాల్ త‌ర‌పున ష‌మీ కీల‌క‌మైన వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఫ్రాంచైజీల కన్ను షమీపై పడింది. ప్రధానంగా మూడు జట్లు షమీని దక్కించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

షమీని టార్గెట్ చేస్తున్న జట్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుంది. నిజానికి షమీ ఐపీఎల్ కెరీర్‌ కేకేఆర్‌తోనే ప్రారంభించాడు. అయితే కేవలం ఒక సీజన్ మాత్రమే కేకేఆర్ తరుపున ఆడాడు. ఇప్పుడు బెంగాల్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న షమీని కేకేఆర్ ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తుంది. షమీని ఢిల్లీ క్యాపిటల్స్ కూడా కొనుగోలు చేయాలనుకుంటోంది. షమీకి ఢిల్లీతో పాత సంబంధం ఉంది. ఇప్పటివరకు అతను ఈ జట్టుతో ఎక్కువ సమయం గడిపాడు. 2014 నుండి 2018 వరకు 5 సంవత్సరాలు ఢిల్లీలో ఉన్నాడు. పైగా ఢిల్లీ పంత్ లాంటి స్టార్ ప్లేయర్ను వదులుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ షమీ కోసం ఆరాటపడుతుంది. అయితే షమీని డీసీ కొనుగోలు చేయాలంటే వేలంలో భారీ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది.

Also Read: Vemulawada : వేములవాడలో పలు అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ

చెన్నై సూపర్ కింగ్స్ అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తుంది. చెన్నై దీపక్ చాహర్‌ను విడుదల చేసింది. ఈ పరిస్థితిలో చెన్నైకి షమీ అవసరం చాలానే ఉంది. షమీకి ఉన్న అపారమైన అనుభవాణ్ని చెన్నై అటిలైజ్ చేసుకోవాలనుకుంటుంది. పైగా షమీ తన భీకర బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను కచ్చితంగా ఇబ్బంది పెట్టగలడు. కాగా చెన్నైలో ధోనీ ఉన్నాడు. వచ్చే సీజన్లో చెన్నై టైటిల్ గెలీవడం చాలా అవసరం. టైటిల్ తో ధోనీకి ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఫ్రాంచైజీ సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో చెన్నైకి మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్లు మాత్రమే కాక టైటిల్ విన్నర్లు అవసరం. దీంతో షమీని తమ జట్టులో చేర్చుకునేందుకు ధోనీ కూడా ప్రణాళికలు రచిస్తున్నాడట. జట్టు విజయంలో బౌలర్లదే కీలక పాత్ర అని ధోనీ బలంగా నమ్మే వ్యక్తి.. ఈ నేపథ్యంలో వేలంలోకి వచ్చిన షమీని ధోనీ వదులుకునేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేడు. మరి షమీ ఏ జట్టులోకి వెళితే బాగుంటుందో మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Indian Premeir League
  • IPL 2025
  • IPL 2025 Mega Auction
  • ipl auction
  • KKR
  • Mohammed Shami
  • shami
  • sports

Related News

Mohammed Shami

Mohammed Shami: ఐపీఎల్లో మహ్మద్ షమీ సరికొత్త రికార్డు

DC vs LSG లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, షమీ ఈ చారిత్రక ఘనత సాధించిన మ్యాచ్‌లో అతని జట్టు లక్నో ఓటమి పాలైంది. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్‌లో లక్నో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో లక్నో నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యా

    Latest News

    • Vijayawada : ఆర్టీసీ బస్ కండక్టర్ చెంప చెళ్లుమనిపించిన మహిళ

    • Tihar Jail : తీహార్ జైలుపై కవిత కీలక వ్యాఖ్యలు

    • World Health Day : ఆరోగ్యమే మహాభాగ్యం- సంపాదన కంటే శరీరమే ముఖ్యం!

    • Husband kills wife in Sangareddy : ప్రియుడితో పారిపోయిన భార్యను హత్య చేసిన భర్త

    • Volunteer System : తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టబోతున్న ప్రభుత్వం

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd