Vemulawada : వేములవాడలో పలు అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ
అభివృద్ధి ప్రణాళికల డిజైన్ మ్యాప్ లను పరిశీలించి, స్థపతి, ఆర్కిటెక్ట్ లతో చర్చించి పలు సూచనలు చేశారు.
- By Latha Suma Published Date - 01:48 PM, Wed - 20 November 24

Vemulawada : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వేములవాడలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మొదట వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కోడే మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సీఎం ధ్వజ స్తంభానికి మొక్కి 12 గంటలకు ఆలయ గర్భగుడిలోనికి చేరుకుని ముందుగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని వద్ద పూజలు నిర్వహించి, నందిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తదుపరి ఆలయ అద్దాల మండపం లో ఆలయ అర్చకులు సీఎం కు ఆశీర్వచనం గావించగా దేవాదాయ శాఖ తరఫున కమిషనర్ శ్రీధర్ శాలువాతో సత్కరించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పట్టువస్త్రాలు అందజేశారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామివారి చిత్రపటం అందించగా, ఆలయ ఈవో వినోద్ రెడ్డి లడ్డు ప్రసాదాలు అందజేశారు. అనంతరం సీఎం వేములవాడలో రూ.127.65 కోట్లతో అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఈక్రమంలో ఆలయ సమీపంలో పలు అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ చేశారు. అంతేకాక.. అభివృద్ధి ప్రణాళికల డిజైన్ మ్యాప్ లను పరిశీలించి, స్థపతి, ఆర్కిటెక్ట్ లతో చర్చించి పలు సూచనలు చేశారు.
ఇక..అనంతరం గుడి చెరువులో ఏర్పాటు చేసిన సభలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు పరిహారం పంపిణీ చేయనున్నారు. నేతన్నల కోసం రూ.50 కోట్లతో నూలు బ్యాంకును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Also: Lakshmidevi: శ్రీ మహాలక్ష్మీదేవికి ఎలాంటి పనులు అంటే ఇష్టం లేదో మీకు తెలుసా?