YSRCP : ఏపీలో వైసీపీ పోరుబాట.. కలెక్టర్లకు వినతి పత్రాలు..
YSRCP : కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కార్యాచరణను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయడం ప్రారంభించారు.
- By Kavya Krishna Published Date - 12:02 PM, Fri - 13 December 24

YSRCP : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కార్యాచరణను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయడం ప్రారంభించారు. ముఖ్యంగా రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. పెట్టుబడి సమస్యలు, గిట్టుబాటు ధరలు, ఉచిత పంటల బీమా రద్దు వంటి కారణాలతో అన్నదాతలు నష్టపోతున్నారని వైసీపీ మండిపడుతోంది.
అనంతపురంలో ఉద్రిక్తతలు
అనంతపురం నగరంలో రైతులకు మద్దతుగా వైసీపీ నిరసన కార్యక్రమం నిర్వహించగా, టీడీపీ కూడా ఫ్లెక్సీల ద్వారా తమ ప్రదర్శన చేసింది. మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వైసీపీ నిరసన ప్రదేశంలో కలకలం రేపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైసీపీ కార్యకర్తలు టీడీపీ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడలో అరెస్టులు
విజయవాడలో కలెక్టరేట్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లే యత్నంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు తగవని పేర్కొన్నారు. విశాఖలో వైసీపీ నేతలు “అన్నదాతకు అండగా” పేరుతో ర్యాలీ నిర్వహించారు. కనీస మద్దతు ధర, తడిచిన ధాన్యం కొనుగోలు, RBK పునరుద్ధరణ వంటి డిమాండ్లతో కలెక్టరేట్ వరకు ప్రదర్శన జరిపి, వినతిపత్రం సమర్పించారు.
IND vs AUS: చితక్కొట్టిన స్మృతి మంధాన.. సూపర్ సెంచరీతో విధ్వంసం
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను పోలీసులు అడ్డుకున్నారు.. రైతులకు అండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో ఈ రోజు విజయవాడ కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లేందుకు సిద్ధమైన వెల్లంపల్లిని ముందుగా.. రథం సెంటర్ వినాయకడి గుడి దగ్గర పూజలు చేసిన తరువాత కలెక్టర్ కార్యాలయానికి బయల్దేరారు.. ఈ నేపథ్యంలోనే పోలీసులు వెల్లంపల్లిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
చిత్తూరులో వైసీపీ పార్టీ నేతలు రైతుల సమస్యలపై ర్యాలీలు నిర్వహించాయి. “సూపర్ సిక్స్” అమలు కోరుతూ వైసీపీ ఆందోళన చేపట్టగా, టీడీపీ గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ ర్యాలీ నిర్వహించింది. వైసీపీ నేతలు వేర్వేరు ప్రాంతాల్లో రైతులకు మద్దతుగా నిరసనలు చేపడుతుండగా, ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా పోలీసులు పలు అరెస్టులు, పికెటింగ్ చర్యలు చేపట్టారు.
Rahane- Prithvi Shaw: ఫామ్ లోకి వచ్చిన పృథ్వీ షా.. రహానే బౌండరీల వర్షం