Rahane- Prithvi Shaw: ఫామ్ లోకి వచ్చిన పృథ్వీ షా.. రహానే బౌండరీల వర్షం
రహానే, పుజారా ఉండి ఉంటే టీమిండియా పరిస్థితి మరోలా ఉండేది. అయితే రహానేను ఆస్ట్రేలియా టూర్ కి సెలెక్ట్ చేయనప్పటికీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం అదరగొడుతున్నాడు.
- By Gopichand Published Date - 12:04 AM, Fri - 13 December 24

Rahane- Prithvi Shaw: అజింక్యా రహానే టీమిండియాకు దూరమై చాలా కాలమే అయింది. ప్రస్తుతం టెస్టులకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న రహానేను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా ఎంపిక చేయలేదు. టెస్టుల్లో నిలకడగా ఆడుతూ బౌలర్ల సహనాన్ని పరీక్షించే రహానే (Rahane- Prithvi Shaw) లేకపోవడంతో ఆ లోటు ఆస్ట్రేలియా సిరీస్ లో స్పష్టంగా కనిపిస్తుంది. రహానే, పుజారా ఉండి ఉంటే టీమిండియా పరిస్థితి మరోలా ఉండేది. అయితే రహానేను ఆస్ట్రేలియా టూర్ కి సెలెక్ట్ చేయనప్పటికీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం అదరగొడుతున్నాడు. తాజాగా విదర్భపై ముంబై తరఫున అజింక్య రహానే 84 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ కు తెరలేపాడు.విదర్భపై అజింక్య రహానే 45 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 84 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో అతని స్ట్రైక్ రేట్ దాదాపు 186గా నమోదైంది.
ఈ మ్యాచ్ లో పృథ్వీ షా కూడా దంచికొట్టాడు. పృథ్వీ షా 26 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49 పరుగుల విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఈ రకంగా పృథ్వీ షా , అజింక్య రహానే దంచికొట్టడంతో ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విదర్భ నిర్దేశించిన 222 పరుగుల లక్ష్యాన్ని ముంబై మరో 4 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. ఈ గెలుపుతో ముంబై సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అజింక్య రహానే అద్భుత ప్రదర్శన చేశాడు.ఆంధ్రప్రదేశ్‌పై 53 బంతుల్లో 95 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అంతకు ముందు కూడా కేరళపై 35 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ప్రస్తుతం రహానే అద్భుతమైన ఫామ్ చూసి టీమిండియాలోకి తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
Also Read: IND vs AUS: చితక్కొట్టిన స్మృతి మంధాన.. సూపర్ సెంచరీతో విధ్వంసం
టి20కి కోహ్లీ రోహిత్ ఎలాగో రీటైర్మెంట్ ప్రకటించారు. సో రహానేను తీసుకుంటే టీమిండియా మరింత బలపడుతుందని నమ్ముతున్నారు. ఇక రహానే దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్ లోనూ రాణిస్తున్నాడు. తాజాగా జరిగిన వేలంలో కేకేఆర్ అతని ప్రాథమిక ధర 1.50 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో రహానే చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడాడు. మరోవైపు ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ పృథ్వీ షాను ఫ్రాంచైజీలు పక్కనపెట్టేశాయి. దీంతో పృథ్వీ షా ఐపీఎల్ కెరీర్ కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే పృథ్వీ షాకు 25 ఎల్లే కావడంతో అతనికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తే కచ్చితంగా టీమిండియాకు హెల్ప్ అవుతాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.