Speed News
-
Prajapalana : నిరుద్యోగికి జీవనోపాధి.. ఇదికదా.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన.. అంటూ ట్వీట్
Prajapalana : మూడువారాల క్రితం, ఎర్రగడ్డకు చెందిన మేదరి అశోక్ అనే నిరుద్యోగి "ప్రజావాణి" కార్యక్రమంలో స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేశాడు. అతడి దరఖాస్తును ఎస్సీ కార్పొరేషన్‌కు పంపగా, అశోక్‌కు ఎలక్ట్రికల్ ఆటోకు సబ్సిడీ మంజూరైంది. ఈ కథనాన్ని ట్వీట్ చేసిన అయోధ్యరెడ్డి, "ఇది కదా ప్రజాపాలన!" అని పేర్కొన్నారు.
Date : 23-11-2024 - 11:23 IST -
CI Ashok : సీఐ కొంప ముంచిన ప్రసంగం.. వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు
CI Ashok : ప్రస్తుతం ఏమైనా బహిరంగ వేదికపై చేసిన వ్యాఖ్యలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, దీంతో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. తాజాగా ఒక పోలీస్ అధికారి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఉన్నతాధికారులు అతడిని వీఆర్‌కు పంపించారు.
Date : 23-11-2024 - 11:09 IST -
Robbery : స్నేహితుడని మొబైల్ షోరూంకు రమ్మంటే.. ఏకంగా రూ.2కోట్ల ఐఫోన్లు చోరీ..
Robbery : ఈ ఆపరేషన్‌లో 120 కొత్త ఐఫోన్లు, 150 పాత ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్బుక్లు, ఇతర షోరూమ్ వస్తువులు, రూ. 3.85 కోట్ల నగదు, దొంగతనానికి ఉపయోగించిన కారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
Date : 23-11-2024 - 10:56 IST -
Elon Musk : 334.3 బిలియన్ డాలర్లతో చరిత్రలో అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్
Elon Musk : 334.3 బిలియన్ డాలర్ల నికర ఆస్తితో (భారతీయ కరెన్సీలో సుమారు రూ.28.22 లక్షల కోట్లు) చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ అవతరించారు. ఫోర్బ్స్ రిపోర్టు ప్రకారం, ఆయన ఇప్పటివరకు ఎవరూ చేరుకోని సంపద స్థాయిని అధిగమించి ఒక కొత్త మైలురాయిని సాధించారు.
Date : 23-11-2024 - 10:44 IST -
CM Chandrababu: పార్లమెంట్ సెషన్స్ నేపథ్యంలో ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం
CM Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో, టీడీపీ ఎంపీలకు వ్యూహాత్మక సూచనలు అందించారు. ప్రధానంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కీలక ప్రాజెక్టుల పురోగతి, అలాగే రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.
Date : 23-11-2024 - 10:30 IST -
Pawan Kalyan : తనకు అందుతున్న ఫిర్యాదులపై పవన్ ట్వీట్
Pawan Kalyan : తనకు ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతోపాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు
Date : 23-11-2024 - 10:17 IST -
India vs Australia: తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలిన ఆసీస్.. ఐదు వికెట్లు తీసిన బుమ్రా!
రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ జట్టు మరో 37 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 3 వికెట్లను కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 104 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Date : 23-11-2024 - 10:10 IST -
Tragedy : ఉప్పల్‌లో దారుణం.. కంట్లో నలక పడిందని వెళితే.. ప్రాణాలు తీసిన వైనం
Tragedy : ఈ విషాదకర ఘటన ఉప్పల్‌లో చోటుచేసుకుంది. చిన్నారి హన్విక కంట్లో నలక పడటంతో ఆసుపత్రికి తీసుకెళ్తే, వైద్యం సమయంలో మృతి చెందింది. ఈ సంఘటన నగరాన్ని కుదిపేసింది. వివరాళ్లోకి వెళితే.. హన్విక కుటుంబం ఉప్పల్ లో నివసిస్తోంది.
Date : 23-11-2024 - 10:02 IST -
8th Pay Commission: ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న జీతాలు!
8వ వేతన సంఘం ఏర్పాటును ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ మీడియా నివేదికల ప్రకారం.. 2025-26 బడ్జెట్లో దీనిని ప్రకటించవచ్చు.
Date : 23-11-2024 - 9:45 IST -
IMD Weather Forecast: 11 రాష్ట్రాలకు అలర్ట్.. ఐఎండీ కీలక సూచనలు!
వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. తూర్పు భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం ప్రక్కనే ఉన్న దక్షిణ అండమాన్‌పై ఎగువ వాయు తుఫాను ప్రసరణ చురుకుగా ఉంది. ఇది సముద్ర మధ్య ట్రోపోస్పియర్ వరకు విస్తరించి ఉంది.
Date : 23-11-2024 - 9:31 IST -
Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్‌లో బీజేపీ దూకుడు.. లీడ్‌లో ప్రియాంక.. అజిత్ పవార్ వెనుకంజ
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత అజిత్ పవార్ తొలి ట్రెండ్స్‌లో తన అసెంబ్లీ నియోజకవర్గం బారామతిలో(Election Results 2024) వెనుకంజలో ఉన్నారు.
Date : 23-11-2024 - 9:12 IST -
Election Date: దేశంలో మరోసారి ఎన్నికలు.. ఆ రాష్ట్రంలో ఎలక్షన్స్!
పంజాబ్‌లో మొత్తం 9 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనుండగా.. అమృత్సర్, జలంధర్, లూథియానా, పాటియాలా, ఫగ్వారాలో సాధారణ ఎన్నికలు జరగనుండగా, భటిండా, బర్నాలా, హోషియార్పూర్, అబోహర్లలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.
Date : 22-11-2024 - 9:55 IST -
Tirupati laddu row : తిరుమల కల్తీ నెయ్యి కేసు..సిట్ దర్యాప్తు ప్రారంభం
నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌తో పాటు తిరుమలలో లడ్డూ పోటు, విక్రయ కేంద్రాలు, ముడిసరకు పరిశీలించనున్నారు.
Date : 22-11-2024 - 7:31 IST -
Barca character : సోలో లెవలింగ్ లో బార్కా పాత్రకు మూడు భాషల్లో రానీ వాయిస్
సోలో లెవలింగ్ లో బార్కా పాత్రకు రానా మూడు భాషల్లో తన వాయిస్ అందిచాడు. దీంతో మూడు భాషల అభిమానులు రానా వాయిస్ ని డిసెంబర్ 6 నుంచి థియేటర్స్ లో వినవచ్చు.
Date : 22-11-2024 - 6:37 IST -
Air pollution : ఢిల్లీలో వాయుకాలుష్య కట్టడికి ప్రవేశ మార్గాల పై నిఘా ఉంచండి: సుప్రీంకోర్టు
ట్రక్కుల ప్రవేశాన్ని తనిఖీ చేయడానికి ఎవరూ లేరు. ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు వెంటనే అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి అని సుప్రీం కోర్టు ఆదేశించింది.
Date : 22-11-2024 - 6:23 IST -
AP Assembly : ఏపీ శాసనసభ, శాసన మండలి నిరవధిక వాయిదా
ఈ సభల్లో 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు పదిరోజులపాటు కొనసాగాయి.
Date : 22-11-2024 - 5:32 IST -
AP PAC Chairman: ఏపీ పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు.. అసెంబ్లీ నిరవధిక వాయిదా!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పీఏసీ ఎన్నికలు ముగిశాయి. కూటమి ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోగా.. వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్‌ను బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. సంఖ్యాబలం లేదనడంతో బాయ్ కాట్ చేశారు. ఈ ఎన్నికల్లో పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు.
Date : 22-11-2024 - 5:12 IST -
PVR INOX : మూవీ జాకీని (ఎంజే) ప్రారంభించిన పివిఆర్ ఐనాక్స్
నిరంతరంగా బుక్కింగ్స్ చేస్తోంది. మరియు అవసరమైన అన్ని మూవీ వివరాలను ఎంతో సులభంగా అందుబాటులో ఉంచుతోంది.
Date : 22-11-2024 - 5:01 IST -
Adani Scam : అదానీని వెంటనే అరెస్టు చేయాలి: పీసీసీ అధ్యక్షుడు మహేష్
రూ.100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి సీఎంలను జైలులో వేశారు. మరి రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడిన అదానీపై చర్యలు ఏవి అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.
Date : 22-11-2024 - 4:32 IST -
Container Hospitals: ఏపీలో కంటైనర్ ఆసుపత్రులు… తొలుత అక్కడే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన్యం ప్రాంతాల్లో డోలీ మోతలకు స్వస్తి చెప్పే విధంగా కీలక చర్యలు తీసుకుంటోంది. గిరిజన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కంటైనర్ ఆస్పత్రులు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు భాగంగా, పార్వతీపురం మన్యం జిల్లాలో మొదటి కంటైనర్ ఆస్పత్రి ప్రారంభమైంది.
Date : 22-11-2024 - 4:13 IST