Shinde Plan B : సీఎం సీటు దక్కకుంటే ఏక్‌నాథ్ షిండే ప్లాన్-బీ ఇదే
మంగళవారం రాత్రి జరిగిన మహాయుతి కూటమి మీటింగ్‌లోనూ ఈ అంశాన్ని షిండే(Shinde Plan B) లేవనెత్తారని తెలిసింది.
- By Pasha Published Date - 12:32 PM, Wed - 27 November 24

Shinde Plan B : మహారాష్ట్రలో కాబోయే సీఎం ఎవరు ? మళ్లీ ఏక్‌నాథ్ షిండేయే సీఎం అవుతారా ? ఈసారి దేవేంద్ర ఫడ్నవిస్‌ను సీఎం చేస్తారా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీంతో రాజకీయ వ్యూహ రచనలో ఉద్దండుడైన షిండే ప్లాన్ బీ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తనకు సీఎం సీటు దక్కకుంటే ఏం చేయాలనే దానిపై ఆయన ప్లాన్‌ను తయారు చేసుకున్నట్లు సమాచారం. మంగళవారం రాత్రి జరిగిన మహాయుతి కూటమి మీటింగ్‌లోనూ ఈ అంశాన్ని షిండే(Shinde Plan B) లేవనెత్తారని తెలిసింది. సీఎం సీటు ఇచ్చే అవకాశం లేకపోతే.. తనకు మహారాష్ట్ర హోంశాఖ, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖలను కేటాయించాలని షిండే కోరారట. మహారాష్ట్రలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో హోం శాఖ సహా మొత్తం 20 కీలకమైన మంత్రిత్వ శాఖలను బీజేపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఏక్‌నాథ్ షిండే శివసేనకు 12 మంత్రిత్వశాఖలను కేటాయిస్తారని సమాచారం. అజిత్ పవార్ ఎన్‌సీపీకి 10 మంత్రిత్వ శాఖలు దక్కొచ్చు. విద్యుత్ శాఖ తన వద్దే ఉండాలని అజిత్ పవార్ చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇవాళ సాయంత్రం కల్లా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read :Jay Bhattacharya : అమెరికా ఎన్‌ఐహెచ్ డైరెక్టర్‌గా జై భట్టాచార్య.. ట్రంప్ ప్రకటన
‘‘ఏక్ ‘నాథ్’ హైతో సేఫ్ హై’’
మరోవైపు షిండే శివసేన ఎమ్మెల్సీ మనీశ్ కాయండే ఎక్స్‌లో ఒక సంచలన పోస్ట్ చేశారు. ‘‘ఏక్ ‘నాథ్’ హైతో సేఫ్ హై’’ అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. మహారాష్ట్రలో మహాయుతి కూటమి గెలుపుపై ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగిస్తూ.. ‘ఏక్ హైతో సేఫ్ హై’ నినాదమిచ్చారు. దాన్ని క్రియేటివ్‌గా మార్చేసి.. షిండే శివసేన ఎమ్మెల్సీ మనీశ్ కాయండే ఎక్స్‌లో పోస్ట్ చేయడం గమనార్హం.ఇక ఈసారి మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ కావాలని .. ఎన్‌డీఏకు చెందిన మరో మిత్రపక్ష నేత రాందాస్ అథవాల్ డిమాండ్ చేశారు. ఈసారి ఫడ్నవిస్‌కే సీఎం సీటు దక్కుతుందన్న ఆయన.. షిండేకు మొండిచెయ్యి తప్పదని వ్యాఖ్యానించారు. బీజేపీ పేరెంట్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్, అజిత్ పవార్‌ల మద్దతు కూడా ఫడ్నవిస్‌కే ఉంది.
అసెంబ్లీ గడువు ముగియడంతో షిండేే మంగళవారం రోజే సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించిన గవర్నర్, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు తాత్కాలిక సీఎంగా కొనసాగాలని సూచించారు. మహారాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 288 సీట్లకుగానూ 132 స్థానాలను బీజేపీ గెల్చుకుంది. షిండే శివసేనకు 57 సీట్లు, అజిత్ పవార్ ఎన్‌సీపీకి 41 సీట్లు వచ్చాయి.