Constitution : ఈ పుస్తకాన్ని ప్రధాని చదివి ఉంటే.. ఇలాంటి పనులు చేసేవాడు కాదు : రాహుల్
గత 3,000 ఏళ్లుగా భారత్‌లో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, పేదల గురించి ఎవరు మాట్లాడినా మైక్ ఆఫ్ అవుతోంది.
- Author : Latha Suma
Date : 26-11-2024 - 4:33 IST
Published By : Hashtagu Telugu Desk
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోడీ కచ్చితంగా రాజ్యాంగాన్ని చదవలేదని అన్నారు. ఒకవేళ ఆయన ఈ పుస్తకాన్ని చదివి ఉంటే, ప్రతి రోజు ఇలాంటి పనులు చేసేవాడు కాదు అని రాహుల్ అన్నారు. ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని చదవలేదన్న గ్యారెంటీ ఇవ్వగలనని అన్నారు. గత 3,000 ఏళ్లుగా భారత్‌లో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, పేదల గురించి ఎవరు మాట్లాడినా మైక్ ఆఫ్ అవుతోంది. మైక్ ఆఫ్ కాగానే చాలా మంది వచ్చి నన్ను వెళ్లి కూర్చోమని చెప్పారు. కూర్చోను, నేను నిలబడతాను, మీ ఇష్టం వచ్చినట్లు మైక్ స్విచ్ ఆఫ్ చేయండి.
ఇదిగో వెనుక రోహిత్ వేముల ఫొటో ఉంది. అతను మాట్లాడాలనుకున్నాడు.. కానీ, అతని గళాన్ని లాగేసుకున్నారు అని రాహుల్ గాంధీ చెప్పారు. దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు నడుస్తున్న మార్గంలో వారిని ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డంగా ఓ గోడ (ఓ భావజాలం) ఉంది. దాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్‌ఎస్‌ఎస్ బలపరుస్తున్నారు. ఆ గోడను బలహీనపర్చడానికి యూపీఏ అనేక చర్యలు తీసుకుందని మో ఈకి తెలిసినప్పటికీ ఆ చర్యలను కొనసాగించలేదు అని రాహుల్ గాంధీ చెప్పారు. ఒకవేళ మోడీ రాజ్యాంగాన్ని చదివి ఉంటే ఇప్పుడు ఆయన చేస్తున్న పనులను చేయకుండా ఉండేవారని రాహుల్ గాంధీ విమర్శించారు.
ఇక, సంవిధాన్ రక్షక్ అభియాన్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిందని, కులగణన అనేది సమాజానికి మెగా హెల్త్ చెకప్ లాంటిందని ఆయన అన్నారు. మేం అంతా గాంధీ కుటుంబం వైపు మద్దతుగా ఉన్నామన్నారు. రాజ్యాంగాన్ని రక్షించేది కూడా గాంధీ కుటుంబం మాత్రమే అని రేవంత్ రెడ్డి అన్నారు.
Read Also: Nuclear Weapons : ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలిస్తే.. మీ అంతు చూస్తాం : రష్యా