Jay Bhattacharya : అమెరికా ఎన్‌ఐహెచ్ డైరెక్టర్‌గా జై భట్టాచార్య.. ట్రంప్ ప్రకటన
అమెరికాలోని శాస్త్రీయ సంస్థలను సంస్కరించి దేశాన్ని మళ్లీ ఆరోగ్యంగా మార్చడమే తమ ఏకైక లక్ష్యమని జై భట్టాచార్య(Jay Bhattacharya) తెలిపారు.
- By Pasha Published Date - 10:19 AM, Wed - 27 November 24

Jay Bhattacharya : మరో భారత సంతతి వ్యక్తికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక పదవి ఖాయమైంది. బెంగాల్ మూలాలున్న జై భట్టాచార్యను అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్)కు తదుపరి డైరెక్టర్‌గా ట్రంప్ నియమించారు. ఈవిషయాన్ని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. జై భట్టాచార్యను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్‌గా నియమిస్తున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. రాబర్డ్ ఎఫ్ కెనడీ జూనియర్ సహకారంతో భట్టాచార్య ఎన్‌ఐహెచ్‌ను నడిపిస్తారని తెలిపారు. అమెరికా ప్రజల ప్రాణాలను కాపాడే ముఖ్యమైన ఆవిష్కరణలు చేసేందుకు జై భట్టాచార్య పనిచేస్తారని ట్రంప్ చెప్పారు. అమెరికాను మళ్లీ ఆరోగ్యవంతంగా మార్చేందుకు కెనడీ, జై భట్టాచార్య కలిసికట్టుగా కృషి చేస్తారని పేర్కొన్నారు.
Also Read :Hanumantha Rao : కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు కారుపై రాళ్ల దాడి
ట్రంప్ చేసిన ప్రకటనపై జై భట్టాచార్య స్పందించారు. తనకు కీలకమైన అవకాశాన్ని కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్ఐహెచ్ డైరెక్టర్‌గా అమెరికాకు సేవలు అందించే అవకాశం దక్కడంపై హర్షం వెలిబుచ్చారు. అమెరికాలోని శాస్త్రీయ సంస్థలను సంస్కరించి దేశాన్ని మళ్లీ ఆరోగ్యంగా మార్చడమే తమ ఏకైక లక్ష్యమని జై భట్టాచార్య(Jay Bhattacharya) తెలిపారు. ఎన్ఐహెచ్ అనేది అమెరికాలో జరిగే వైద్య పరిశోధనలను పర్యవేక్షించే కీలకమైన విభాగం. దేశంలోని ఔషధ, వ్యాక్సిన్ కంపెనీలు చేసే ట్రయల్స్‌పై ఎన్ఐహెచ్‌కు నియంత్రణ ఉంటుంది. జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆలోగా తన మంత్రివర్గం, ప్రభుత్వంలోని కీలక పదవుల కోసం యోగ్యులైన వారిని ట్రంప్ ప్రస్తుతం ఎంపిక చేసుకుంటున్నారు. ఈ జాబితాలో చాలామంది భారత సంతతి వారికి ట్రంప్ చోటు కల్పించారు. సాక్షాత్తు కాబోయే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా మన తెలుగింటి అల్లుడే. బైడెన్ హయాంలో అమెరికాకు అన్ని రంగాల్లో జరిగిన నష్టాన్ని పూడుస్తానని ట్రంప్ చెబుతున్నారు.