HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Shock For Former Minister Cv Shanmugam In Supreme Court

Supreme Court: మాజీ మంత్రి సీవీ షణ్ముగంకు సుప్రీంకోర్టులో షాక్?

సుప్రీంకోర్టు, అన్నాడీఎంకే సీనియర్ నేత సీవీ షణ్ముగంకు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కించపరిచేలా, అగౌరవపరిచేలా మాట్లాడటం తప్పేనని, అందువల్ల ఈ కేసు విచారణ ఎదుర్కోవాల్సిందేనంటూ చెప్పుకొచ్చింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 27-11-2024 - 12:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Supreme Court Shock To Cv Shanmugham
Supreme Court Shock To Cv Shanmugham

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరిచేలా, ఆయనను అగౌరవపరిచేలా మాట్లాడటం ఎలాంటి పరిస్థితుల్లోనైనా అంగీకరించదగిన పని కాదని, అందుకే సీవీ షణ్ముగం ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

తాజాగా, కొత్త కార్మిక చట్టం ప్రకారం 12 గంటల పని సమయం, వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు పంపించడం, గంజాయి రవాణా, మద్యం విక్రయాలు మొదలైన అంశాలపై అన్నాడీఎంకే ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో, సీవీ షణ్ముగం ముఖ్యమంత్రి స్టాలిన్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేయడమే కాకుండా, ఆయనపై అవహేళనపూర్వక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, ముఖ్యమంత్రిని ఇలాంటి విధంగా విమర్శించడం అనైతికమని, అందుకే సీవీ షణ్ముగంకు ఈ విషయంలో విచారణ తప్పదని పేర్కొంది.

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు:

డీఎంకే నేతలు, ముఖ్యమంత్రి స్టాలిన్‌పై వ్యక్తిగత విమర్శలు చేసినందుకు పరువు నష్టం కేసు దాఖలు చేయడంతో, జిల్లా కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా, సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది. ఈ నేపథ్యంలో, సీవీ షణ్ముగం ఈ కేసు రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దానికి సంబంధించిన విచారణ ప్రస్తుతం అపెక్స్ కోర్టులో కొనసాగుతోంది.

ఈ కేసులో, ముఖ్యమంత్రి స్టాలిన్‌పై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని, తన ప్రమాణ పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు 23 సెప్టెంబరు న సీవీ షణ్ముగంకు ఆదేశించింది. అదేవిధంగా, జిల్లా కోర్టు విచారణపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది.

ఈ అంశం మంగళవారం సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు సుదన్షు తులియా, అజానుద్దీన్ అమనుల్లాలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. “ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరిచేలా మాట్లాడటం ఎంతవరకు సబబు?” అని ప్రశ్నించారు. “అసత్య ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయడం సహజమే కదా?” అని కూడా వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీవీ షణ్ముగం ఈ కేసు విచారణను ఎదుర్కోవాల్సిందేని, ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ, ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AIADMK Leader
  • CV Shanmugham
  • dmk
  • Tamil Nadu CM Stalin

Related News

DMK Bids Farewell to Alliance

DMK: పొత్తుకు గుడ్ బై చెప్పిన డీఎంకే

తమిళనాడు రాజకీయాల్లో ఒక భూకంపం వంటి పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన విభేదాలు, ఇప్పుడు జాతీయ స్థాయిలో డీఎంకే – కాంగ్రెస్ మధ్య దశాబ్దాల కాలం నాటి పొత్తు తెగిపోయేలా చేశాయి. టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే, చివరకు కాంగ్రెస్‌తో బంధాన్ని అధికారికంగా తెంచుకుంది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, ల

  • Vijay Holds Key Meeting with MLAs

    TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

  • DMK and AIADMK Hold Talks on Government Formation

    Tamil Nadu Politics: ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే – అన్నాడీఎంకే చర్చలు..!

  • Stalin Makes Sensational Comments on Vijay Forming a Government

    MK Stalin: విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై.. స్టాలిన్ సంచలన కామెంట్స్!

Latest News

  • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

  • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

  • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

  • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

  • iBOMMA: టాలీవుడ్‌కి బిగ్‌షాక్‌.. రీ ఎంట్రీ ఇచ్చిన ఐబొమ్మ

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd