Actor SubbaRaju: ప్రముఖ నటుడు సుబ్బరాజు ఒక ఇంటివాడు అయ్యాడు…
ప్రముఖ నటుడు సుబ్బరాజు వివాహ బంధంలోకి అడుగుపెట్టారని స్వయంగా ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
- By Kode Mohan Sai Published Date - 11:14 AM, Wed - 27 November 24

ప్రముఖ నటుడు సుబ్బరాజు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ అద్భుతమైన వార్తను ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తన భార్యతో బీచ్ ఒడ్డున దిగిన ఒక అందమైన ఫోటోని షేర్ చేస్తూ, పెళ్లి బట్టల్లో వారిద్దరు చక్కగా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ శుభవార్త తెలియగానే అభిమానులు, సినీ ప్రముఖులు సుబ్బరాజు-తన భార్య జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సుబ్బరాజు పెళ్లికి సంబంధించి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆయన సతీమణి పేరు మరియు పెళ్లి జరిగిన ప్రదేశం ఇంకా తెలియలేదు. గతంలో సుబ్బరాజు పెళ్లి గురించి ఇంటర్వ్యూల్లో అనేక సార్లు ప్రస్తావించినప్పుడు, పెళ్లి గురించి ఆయనకు ఆసక్తి లేదని చెప్పిన విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు 47వ సంవత్సరంలో ఎట్టకేలకు ఓ ఇంటివాడు అయ్యారు సుబ్బరాజు. పెళ్లి మాత్రం చాలా సింపుల్‌గా, హడావుడి లేకుండా జరిగినట్లు తెలుస్తోంది.
కృష్ణ వంశీ దర్శకత్వంలో ఖడ్గం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుబ్బరాజు, ఆ సినిమాలో చిన్న పాత్రలోనే కనిపించారు. అయితే, ఈ అవకాశం సుబ్బరాజుకు అనుకోకుండా వచ్చింది. ఆ సమయంలో కృష్ణ వంశీ గారు తన కంప్యూటర్ రిపేర్ కోసం సుబ్బరాజును కలిశారు, అక్కడే సుబ్బరాజుకు సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.
తర్వాత, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించారు. ఈ విజయంతో, సుబ్బరాజు ఇక వెనుక తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. క్రమంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్‌గా పలు పాత్రలు పోషించి, తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన తన ప్రతిభతో అభిమానుల మన్ననలు గెలుచుకున్నారు.
నటుడు సుబ్బరాజు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి ఫోటో ఇన్ స్టాలో పోస్టు చేశారు. పెళ్లి కూతురుతో కలిసి బీచ్ లో దిగిన ఫొటోను పంచుకున్నారు. #Subbaraju #Wedding #Tollywood #HashtagU @actorsubbaraju pic.twitter.com/Xnu0R8tVPs
— Hashtag U (@HashtaguIn) November 27, 2024