vijay paul : విజయ్ పాల్ అరెస్టు సంతోషకరం: రఘురామ కృష్ణరాజు
పోలీసుల పై ఉందన్నారు. సునీల్ కుమార్,విజయ్ పాల్ అంత ఒక ముఠా అంటూ రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు
- By Latha Suma Published Date - 12:53 PM, Wed - 27 November 24

Raghurama Krishnaraja : సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ అరెస్టుపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ ఎన్నో దందాలు చేశారు. ఆయన పాపం పండిందన్నారు. విజయ్ పాల్ ను అరెస్ట్ చేయడం సంతోషంగా అనిపించిందన్నారు. అయితే ఆయన తెలియదు అని క్రిమినల్ లాగా సమాధానాలు చెప్తున్నారు అని తెలిసింది. నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారని ఆగ్రహించారు. అసలు కుట్ర చేసింది పీవీ సునీల్ కుమార్ అని…నన్ను కస్టోడియాల్ టార్చర్ చేసిన వారిలో కీలక నిందితుడిని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారని సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, పీవీ సునీల్ కుమార్ దేశం విడిచి పారిపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసుల పై ఉందన్నారు. సునీల్ కుమార్,విజయ్ పాల్ అంత ఒక ముఠా అంటూ రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు. అందరూ కలిసి కుట్ర చేశారు. ఇప్పటికే ఆలస్యం అయ్యిందని… పీవీ సునీల్ కుమార్ ప్రధాన నిందితుడని ఆరోపణలు రఘురామ కృష్ణరాజు చేశారు. ఆయన తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వారు… పీవీ సునీల్ కుమార్ కి లుక్ ఔట్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాగా, ఏపీలో గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి రెబెల్ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుని రాజద్రోహం కేసులో అరెస్టు చేసి కస్టడీలో హింసించారు. ఈ వ్యవహారంలో అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ ను ఈరోజు రెండోసారి విచారణకు పిలిచిన పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం నుంచీ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో జరిగిన విచారణ అనంతరం ఆయన్ను అరెస్టు చేశారు.
అయితే తనకు బెయిల్ ఇవ్వలంటూ.. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆయన నేడు ఒంగోలు ఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. సాయంత్రం వరకూ విచారణ తర్వాత ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో రఘురామకృష్ణంరాజును అరెస్టు చేశాక కస్టడీలో హింసించిన ఆరోపణలపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో సీఐడీ మాజీ ఏసీపీ విజయ్ పాల్ ను నిందితుడిగా చేర్చారు.
Read Also:Shinde Plan B : సీఎం సీటు దక్కకుంటే ఏక్‌నాథ్ షిండే ప్లాన్-బీ ఇదే