India
-
Nimisha Priya: నిమిష ప్రియను వీలైనంత త్వరగా ఉరితీయండి
Nimisha Priya: యెమెన్‌లో మరణశిక్ష విధింపునకు గురవుతున్న కేరళ నర్సు నిమిష ప్రియ భవిష్యత్తు మరింత అనిశ్చితంగా మారుతోంది.
Published Date - 07:59 PM, Mon - 4 August 25 -
Modi-Amit Shah : రాష్ట్రపతితో ప్రధాని, హోంమంత్రి వరుస భేటీలు.. జమ్ము కశ్మీర్‌పై కీలక సంకేతాలా?
ఈ సమావేశాలు జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణను దృష్టిలో ఉంచుకుని జరిగే అవకాశముందని సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయం అనంతరం జమ్ము కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా(జమ్ము కశ్మీర్ మరియు లడఖ్) విభజించారు.
Published Date - 06:07 PM, Mon - 4 August 25 -
Central Govt : కాళేశ్వరం పూర్తి చేస్తే అప్పులపై వడ్డీ తగ్గింపును పరిశీలిస్తాం: కేంద్రం
తెలంగాణ ప్రభుత్వం తరఫున కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అప్పుల పునర్వ్యవస్థీకరణ (రీషెడ్యూలింగ్)కు కేంద్రం ముందుకొచ్చేలా విన్నపాలు అందాయని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి ప్రత్యేక సంస్థ (Special Purpose Vehicle – SPV) రూపంలో ఏర్పాటైన యూనిట్‌కు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (REC) వంటి సంస్థలు రుణాలు మంజూరు చేశాయని తెలి
Published Date - 05:19 PM, Mon - 4 August 25 -
Rahul Gandhi : సోషల్ మీడియాలో కాదు.. పార్లమెంటులో మాట్లాడండి : రాహుల్ గాంధీకి సుప్రీం సూచన
రాహుల్ గాంధీ 2022 డిసెంబర్లో 'భారత్ జోడో యాత్ర'లో మాట్లాడుతూనే, గల్వాన్ ఘర్షణల తర్వాత చైనా దాదాపు 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఓ మాజీ రక్షణ అధికారి, లక్నో కోర్టులో పరువునష్టం దావా వేశారు.
Published Date - 01:24 PM, Mon - 4 August 25 -
Kamal Haasan : సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల ఏకైక ఆయుధం విద్యే : కమల్ హాసన్
సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల ఏకైక ఆయుధం చదువే. ప్రజలు గద్దలు, ఆయుధాలు కాదు... పుస్తకాలను చేతిలోకి తీసుకోవాలి. ఎందుకంటే అజ్ఞానం చేతిలో ఓడిపోతాం. మూర్ఖులే ఎక్కువైతే మన సమాజం వెనక్కి పోతుంది అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. సినీ నటుడు సూర్య స్థాపించిన అగరం ఫౌండేషన్ విద్య ద్వారా సామాజిక మార్పు కోసం పనిచేస్తోన్నది తెలిసిందే.
Published Date - 12:29 PM, Mon - 4 August 25 -
Shocking Incident : క్షుద్రపూజలు చేస్తున్నాడని వ్యక్తి దారుణహత్య.. ప్రైవేట్ పార్ట్స్ కోసి..
Shocking Incident : ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలో మానవత్వాన్ని మట్టగలిపే భయంకర ఘటన చోటుచేసుకుంది. క్షుద్ర విద్య, చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో గ్రామస్తులు ఒక వ్యక్తిని కిరాతకంగా హత్య చేసి, అతడి శరీరాన్ని అమానుషంగా ధ్వంసం చేశారు.
Published Date - 10:46 AM, Mon - 4 August 25 -
Jharkhand : ఝార్ఖండ్ మాజీ సీఎం శిబూసోరెన్ కన్నుమూత
శిబు సోరెన్ జీవితమే ఒక ఉద్యమంగా నిలిచింది. గిరిజనుల హక్కుల కోసం, వారి అణచివేతకు వ్యతిరేకంగా 1972లో ఆయన "జార్ఖండ్ ముక్తి మోర్చా" అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ అనంతరం జార్ఖండ్ ప్రజల ఆశల ప్రతీకగా ఎదిగింది. ఆదివాసీల సమస్యలు, ఉపేక్షిత జీవన పరిస్థితులు, భూమి హక్కులు ఇవన్నిటికీ శిబు సోరెన్ కంఠస్వరంగా నిలిచారు.
Published Date - 10:18 AM, Mon - 4 August 25 -
DK Shivakumar : మరోసారి సిద్ధరామయ్యతో విభేదాలను బయటపెట్టిన డీకే..సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో జరిగిన 'రాజ్యాంగ సవాళ్లు' అనే కార్యక్రమంలో పాల్గొన్న డీకే శివకుమార్ అక్కడ తన హోదా, పార్టీకి చేసిన సేవలను గుర్తు చేస్తూ, అధికార భాగస్వామ్యం గురించి అస్పష్టంగా కానీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తేవడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు.
Published Date - 09:42 AM, Mon - 4 August 25 -
Vande Bharat Sleeper : పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు
Vande Bharat Sleeper : భారతీయ రైల్వేలో ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేయబోతోంది.
Published Date - 09:15 AM, Mon - 4 August 25 -
Medicines : దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నవారికి గుడ్ న్యూస్.. 35 మందుల ధరలు తగ్గించిన కేంద్రం
గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, ఒంటినొప్పులు, మానసిక ఆరోగ్య సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఉపయోగించే మందుల ధరలు తగ్గించడమే ఈ నిర్ణయ లక్ష్యం. ఈ నిర్ణయాన్ని కేంద్ర రసాయనిక ఎరువుల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.
Published Date - 08:48 AM, Mon - 4 August 25 -
Pahalgam attacker : పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ ఉగ్రవాదులే.. వెలుగులోకి మరో ఆధారం
మృతదేహం అందుబాటులో లేనప్పుడు నిర్వహించే ‘జనాజా-ఎ-గైబ్’ విధానంలో ఆయన అంత్యక్రియలు జరపడం గమనార్హం. ఈ కార్యక్రమం రావల్కోట్లోని ఖైగాలా ప్రాంతంలో జరిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ఈ గ్రామంలో పలువురు పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఓ టెలిగ్రామ్ ఛానల్లో వెలువడ్డాయి.
Published Date - 12:44 PM, Sun - 3 August 25 -
Grey Zone Warfare : గ్రే జోన్ వార్ఫేర్.. చైనా-పాకిస్తాన్ వ్యూహాలకు భారత్ కొత్త సవాళ్లు
Grey Zone Warfare : భారత్ ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లలో గ్రే జోన్ వార్ఫేర్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇది పూర్తి స్థాయి యుద్ధం కాకుండా, ఓ దేశం తన వ్యూహాత్మక లక్ష్యాలను సాధించేందుకు గుప్తంగా చేపట్టే చర్యల సమాహారం.
Published Date - 11:56 AM, Sun - 3 August 25 -
Ind vs Pak Match: జవాన్ల రక్తం కంటే బీసీసీఐకి డబ్బే ముఖ్యం.. ఎంపీ సంచలన ఆరోపణలు!
శివసేన (UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై కేంద్ర ప్రభుత్వం, భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Published Date - 11:42 AM, Sun - 3 August 25 -
India-US Trade : భారత్-అమెరికా మధ్య భారీగా క్రూడ్ ఆయిల్ దిగుమతులు..
India-US Trade : 2025లో భారత్-అమెరికా ముడి చమురు వాణిజ్యం గణనీయంగా పెరిగి, ఇరుదేశాల ఆర్థిక సంబంధాల్లో కొత్త దశను ప్రారంభించింది.
Published Date - 11:37 AM, Sun - 3 August 25 -
Jammu and Kashmir : అనంత్ నాగ్‌లో బయటపడ్డ 8వ శతాబ్దానికి చెందిన పురాతన హిందూ దేవతా విగ్రహాలు
తవ్వకాల్లో శివలింగాలు, పార్వతి మాత, విష్ణుమూర్తి తదితర దేవతల విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి. పురాతత్వ నిపుణులు ఈ విగ్రహాలను పరిశీలించి, ఇవి కర్కోట రాజుల కాలానికి చెందినవని గుర్తించారు. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని కర్కోట వంశానికి చెందిన రాజులు పాలించారని చరిత్రకారులు పేర్కొంటున్నారు.
Published Date - 11:02 AM, Sun - 3 August 25 -
Operation Akhal : కుల్గాంలో నలుగురు ఉగ్రవాదులు హతం.!
Operation Akhal : కుల్గాం జిల్లా అఖల్ ప్రాంతంలో ఉగ్రవాద నిర్మూలన చర్యలు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఆగస్టు 1న ప్రారంభమైన ఈ ‘ఆపరేషన్ అఖల్’లో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా పాల్గొంటున్నాయి.
Published Date - 10:50 AM, Sun - 3 August 25 -
US : అమెరికాలో తెలుగు యువకుడు జైలులో ఆత్మహత్య
సుమారు పదేళ్ల క్రితం సాయికుమార్ ఉద్యోగ వేత్తగా అమెరికా వెళ్లాడు. అతడు ఒక్లహామా రాష్ట్రంలోని ఎడ్మండ్ నగరంలో భార్యతో కలిసి నివసించేవాడు. స్థానికంగా సాఫ్ట్వేర్ రంగంలో పని చేస్తున్నట్లు సమాచారం. అయితే, అక్కడ ఉన్నత జీవితం గడుపుతున్న సాయికుమార్ పిరికిదనపు మార్గంలోకి వెళ్లాడు.
Published Date - 09:12 AM, Sun - 3 August 25 -
FASTag : ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ప్రారంభం.. ప్రయోజనాలు, ధర పూర్తి వివరాలు ఇవిగో..!
టోల్ ఫీజు లావాదేవీలను మరింత సులభతరం చేయడానికి కేంద్రం తీసుకొచ్చిన ఈ యాన్యువల్ పాస్ ద్వారా ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్లు కలిగిన వాహనదారులు ఏడాది పాటు టోల్ ఛార్జీలను ముందుగానే చెల్లించి, నిర్బంధ రీచార్జ్‌ల అవసరం లేకుండా ప్రయాణించవచ్చు. దీనికి రూ.3,000గా వార్షిక చార్జ్ నిర్ణయించబడింది. ఈ పాస్ చెల్లుబాటు అయ్యే వ్యవధి రెండు నిబంధనల ఆధారంగా ఉంటుంది.
Published Date - 08:46 AM, Sun - 3 August 25 -
Amarnath Yatra : అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక విరామం
యాత్రికుల భద్రతే ప్రధాన ప్రాముఖ్యతని స్పష్టం చేశారు. ప్రస్తుతం పహల్గాం, బల్తాల్ మార్గాల్లో భక్తులను అనుమతించడం లేదని తెలిపారు. భారీ వర్షాల కారణంగా రహదారులు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడటంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఈ పరిస్థితుల్లో యాత్ర కొనసాగించడం కష్టంగా మారిందని అధికారులు పేర్కొన్నారు.
Published Date - 04:16 PM, Sat - 2 August 25 -
Prajwal Revanna : తక్కువ శిక్ష వేయండి.. కోర్టులో కన్నీరుమున్నీరైన ప్రజ్వల్ రేవణ్ణ
బెంగళూరులోని ప్రజాప్రతినిధుల నేరాలు విచారించే ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు శిక్ష ఖరారు చేయనుంది. తీర్పు ప్రకటించే ముందు, కోర్టులో న్యాయమూర్తిని వేడుకుంటూ తక్కువ శిక్ష వేయాలంటూ ప్రజ్వల్ ప్రార్థించాడు.
Published Date - 03:03 PM, Sat - 2 August 25