CWC meet: పాట్నాలో ప్రారంభమైన కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం – బీహార్ ఎన్నికలపై వ్యూహరచన
స్వాతంత్ర్యం తర్వాత బీహార్‌లో తొలి సీడబ్ల్యూసీ సమావేశం ఇదే కావడం ప్రత్యేకత. కాంగ్రెస్ పార్టీ ఈ భేటీలో రెండు కీలక తీర్మానాలను ఆమోదించే అవకాశముందని సమాచారం.
- By Dinesh Akula Published Date - 02:40 PM, Wed - 24 September 25

CWC meet: పాట్నా, బీహార్: పాట్నాలోని సదాకత్ ఆశ్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ఘనంగా ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి శ్రీకారం చుట్టారు. ఈ సీడబ్ల్యూసీ భేటీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి, ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీఎల్పీ లీడర్లు, పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.
బిహార్‌లో జరిగిన ఓటర్ అధికార్ యాత్ర తర్వాత రాహుల్ గాంధీ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. రాహుల్ గాంధీ ఆగస్టు 17 నుంచి 15 రోజుల పాటు బీహార్‌లోని 25 జిల్లాల్లో ఈ యాత్రను నిర్వహించారు. ఈ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై వ్యూహరచనకు ఈ సీడబ్ల్యూసీ సమావేశం వేదికగా మారింది.
आज पटना के ऐतिहासिक सदाकत आश्रम में CWC की विस्तारित बैठक हुई।
इस बैठक में कांग्रेस अध्यक्ष श्री @kharge और नेता विपक्ष श्री @RahulGandhi के साथ CWC के सदस्य मौजूद रहे।
📍 बिहार pic.twitter.com/5dl1JF82ni
— Congress (@INCIndia) September 24, 2025
స్వాతంత్ర్యం తర్వాత బీహార్‌లో తొలి సీడబ్ల్యూసీ సమావేశం ఇదే కావడం ప్రత్యేకత. కాంగ్రెస్ పార్టీ ఈ భేటీలో రెండు కీలక తీర్మానాలను ఆమోదించే అవకాశముందని సమాచారం. దేశవ్యాప్తంగా ఓటు లెక్కింపు విషయంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేలా పార్టీ తన దిశానిర్దేశం చెబుతుంది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఓటు లెక్కింపు అవకతవకలపై సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అదే సమయంలో బీహార్ ఎన్నికల దృష్ట్యా రాజకీయ ప్రాధాన్యత కలిగిన ఈ సమావేశం, రాహుల్ గాంధీ, ఖర్గే నాయకత్వంలో తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలు పార్టీ భవిష్యత్‌ను ప్రభావితం చేయనున్నాయని నేతలు భావిస్తున్నారు.
ఈ సమావేశం ద్వారా బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పునరుత్తేజం పొందాలని, పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.