India
-
PM Modi : జపాన్‌లో ప్రధాని మోడీ..బుల్లెట్ ట్రైన్ ప్రయాణం, రాష్ట్రాల స్థాయిలో కొత్త భాగస్వామ్యానికి శ్రీకారం
ఈ పర్యటనలో మోడీ ప్రత్యేకంగా జపాన్ ప్రిఫెక్చర్లపై దృష్టి సారించారు. దేశస్థాయిలో మాత్రమే కాకుండా, రాష్ట్ర స్థాయిలోనూ భారత్-జపాన్ సంబంధాలను విస్తరించాలన్న లక్ష్యంతో ఆయన ముందడుగు వేశారు. టోక్యోలో 16 జపాన్ ప్రిఫెక్చర్ల గవర్నర్లతో మోదీ సమావేశమయ్యారు.
Date : 30-08-2025 - 10:59 IST -
Ram Setu : రామసేతుకు జాతీయ వారసత్వ కట్టడంగా గుర్తింపు డిమాండ్ పై సుప్రీంకోర్టులో కీలక ముందడుగు
సుబ్రహ్మణ్యస్వామి తన పిటిషన్‌లో రామసేతువు మతపరమైన, చారిత్రక ప్రాధాన్యతను గుర్తించి, దాని పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలన్న డిమాండ్‌ను ఆయన ఏళ్లుగా వినిపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో, సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Date : 29-08-2025 - 4:46 IST -
Amit Shah: రాహుల్ గాంధీకి అమిత్ షా అల్టిమేటం.. మోదీపై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సిందే.!
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం బిహార్‌లోని దర్భంగాలో మహాకూటమి నిర్వహించిన ‘వోటర్ అధికార్ యాత్ర’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దూషణలు, అభ్యంతరకర నినాదాలు చేశారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ , దాని మిత్రపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Date : 29-08-2025 - 4:15 IST -
Subhas Chandra Bose : నేతాజీ అస్థికలు భారతదేశానికి రప్పించండి..ప్రధాని మోడీకి అనితా బోస్ భావోద్వేగ విజ్ఞప్తి
అనితా బోస్ ప్రధానమంత్రిని ప్రత్యక్షంగా కలిసే అవకాశాన్ని ఆశిస్తూ, తండ్రి అస్థికల అంశానికి తక్షణ పరిష్కారం కోరారు. జర్మనీలో నివసిస్తున్న అనితా బోస్ వయసు ప్రస్తుతం 82 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో ఈ అంశం తక్షణ చర్యకు లోనవ్వాలని ఆమె అంటున్నారు. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆమె చెప్పిన మాటలు హృదయాన్ని కదిలించేవిగా ఉన్నాయి.
Date : 29-08-2025 - 3:52 IST -
Urjit Patel : ఉర్జిత్ పటేల్‌కు అంతర్జాతీయ గౌరవం..IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియామకం
ఆయన నియామకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని నియామకల కమిటీ ఆమోదించింది. ఉర్జిత్ పటేల్ మూడేళ్ల కాలానికి ఈ హోదాలో కొనసాగనున్నారు. లేదా ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పదవిలో ఉంటారు.
Date : 29-08-2025 - 12:58 IST -
PM Modi : జపాన్‌లో మోడీ పర్యటన: ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశ
ఈ సందర్బంగా ఆయన 15వ భారత-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ తన జపాన్ ప్రత్యుతంగా ఉన్న ప్రధాని షిగెరు ఇషిబాతో కీలక చర్చలు జరగనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ సహకారం వంటి అనేక అంశాలపై ఇరు దేశాధినేతలు దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.
Date : 29-08-2025 - 10:39 IST -
Teachers : దేశ వ్యాప్తంగా కోటి దాటిన టీచర్ల సంఖ్య
Teachers : ఉపాధ్యాయుల సంఖ్య పెరగడం సానుకూల పరిణామమే అయినా, ఈ పెరుగుదల నాణ్యతతో కూడిన విద్యను అందిస్తుందా అనేది ప్రధాన ప్రశ్న
Date : 29-08-2025 - 9:50 IST -
Cloudburst In Uttarakhand : ఉత్తరాఖండ్లో మళ్లీ క్లౌడ్ బరస్ట్
Cloudburst In Uttarakhand : రుద్రప్రయాగ్ జిల్లాలోని బరెత్ దంగర్ టోక్, చమోలీ జిల్లాలోని దేవల్లో ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) విరుచుకుపడ్డాయి
Date : 29-08-2025 - 9:36 IST -
Indigo : భారీ ప్రమాదం తప్పింది.. గాల్లోనే ఇంజిన్ ఆగిపోయిన ఇండిగో విమానం
Indigo : అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘటన మరువకముందే, విమాన ప్రయాణాల్లో సాంకేతిక లోపాలు కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలోనే, సూరత్ నుండి దుబాయ్ వెళ్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది.
Date : 28-08-2025 - 4:51 IST -
IB Jobs : డిప్లొమా, డిగ్రీ అర్హతతో IBలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల
IB Jobs : దేశ భద్రతలో కీలకపాత్ర పోషించే ఈ సంస్థలో జూనియర్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II, టెక్నికల్ (JIO-II/Tech) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 28-08-2025 - 4:10 IST -
Telangana : భారీ వర్షాలు.. 36 రైళ్లు రద్దు..మరికొన్ని దారి మళ్లింపు..
భారీ వర్షాలు, వరదల కారణంగా రైల్వే ట్రాక్‌లపై నీరు చేరడంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మొత్తం 36 రైళ్లను పూర్తిగా రద్దు చేయాల్సి వచ్చిందని, 25 రైళ్లను మార్గం మళ్లించామని ఇంకా 14 రైళ్లను పాక్షికంగా మాత్రమే రద్దు చేసినట్లు వివరించారు.
Date : 28-08-2025 - 1:54 IST -
Voter Adhikar Yatra : బీజేపీ-ఎన్నికల సంఘం కుమ్మక్కు: ప్రజాస్వామ్యానికి అపహాస్యమన్న రాహుల్ గాంధీ
ఇది కేవలం ఓటింగ్ ప్రాసెస్‌ను చెక్కుమణిపెట్టడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేయడమే అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయని ఈ చర్యలు పక్కా ప్రణాళిక కింద జరుగుతున్నట్లు ఆరోపించారు.
Date : 28-08-2025 - 1:23 IST -
Jio-Airtel : వరద బాధితులకు జియో, ఎయిర్‌టెల్ సాయం..!
Jio-Airtel : భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక రాష్ట్రాల్లో ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలో నీరు చేరిపోవడం, రవాణా వ్యవస్థలు దెబ్బతినడం, కనెక్టివిటీ సమస్యలు ఏర్పడటంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Date : 28-08-2025 - 1:00 IST -
Mizoram : అసెంబ్లీలో ‘యాచక నిషేధ బిల్లు 2025’కు ఆమోదం
ఈ బిల్లు ద్వారా కేవలం యాచకత్వాన్ని నిషేధించడమే కాదు, భిక్షాటన చేస్తున్న వారికి పునరావాసం కల్పించే అంశాన్నీ ప్రభుత్వం కీలకంగా పరిగణిస్తోంది. ఈ చట్టాన్ని తీసుకురావడానికి ప్రేరణగా మారింది సైరంగ్-సిహ్ము రైల్వే ప్రాజెక్టు.
Date : 28-08-2025 - 12:19 IST -
Vaishno Devi Landslide : వైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండచరియలు.. 35 మంది మృతి
Vaishno Devi Landslide : జమ్మూకశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయం మార్గం వద్ద చోటుచేసుకున్న భారీ కొండచరియల విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 35 మంది మృతి చెందారు.
Date : 28-08-2025 - 12:15 IST -
Bihar : బిహార్‌లో హై అలర్ట్ : అసెంబ్లీ ఎన్నికల ముందే జైషే ఉగ్రవాదుల చొరబాటు కలకలం
నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఉగ్రవాదులను హస్నైన్ అలీ (రావల్పిండి), ఆదిల్ హుస్సేన్ (ఉమర్‌కోట్), మహ్మద్ ఉస్మాన్ (బహవల్‌పూర్)గా గుర్తించారు. వీరంతా పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహ్మద్ ముఠాకు చెందినవారుగా పోలీసులు పేర్కొన్నారు.
Date : 28-08-2025 - 11:17 IST -
Textile Industry : దేశీయ టెక్స్‌టైల్ పరిశ్రమకు ఊరట : పత్తి దిగుమతులపై సుంకాల మినహాయింపు
ఈ నిర్ణయం టెక్స్‌టైల్ పరిశ్రమలో ఉత్పత్తి వ్యయాలను గణనీయంగా తగ్గించడంతో పాటు, వినియోగదారులకు మరింత అనుకూలంగా మారనుంది. ముఖ్యంగా ముడిసరుకు ధరలు పెరుగుతున్న ఈ తరుణంలో, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమలో ఉత్సాహం రేపుతోంది.
Date : 28-08-2025 - 11:01 IST -
Jammu Kashmir : ఉగ్రకుట్ర భగ్నం.. సైనికుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం మరోసారి సమర్థవంతంగా తిప్పికొట్టింది. గురువారం (ఆగస్టు 28) బందిపొరా జిల్లా గురెజ్ సెక్టార్‌లో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Date : 28-08-2025 - 10:52 IST -
Tragedy : కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. 14 మంది మృతి
Tragedy : మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ఘోర విషాదానికి వేదికైంది. ముంబై సమీపంలోని విరార్ ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న భవన ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
Date : 28-08-2025 - 10:25 IST -
America : టారిఫ్ ఎఫెక్ట్ ..ఎగుమతులపై తీవ్ర ప్రభావం, కేంద్రం ప్రత్యామ్నాయ వ్యూహం
ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తక్షణ స్పందనతో ప్రత్యామ్నాయ వ్యూహం రూపొందించింది. వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో 40 దేశాల్లో ప్రత్యేకంగా భారత ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అధికార వర్గాల ప్రకారం, ఈ కార్యక్రమాల ద్వారా భారత్ ఉత్పత్తులకు కొత్త మార్కెట్లు కల్పించడంతోపాటు, ఇప్పటికే ఉన్న మార్కెట్లలో వాటి స్థిరతను పెంచే ల
Date : 28-08-2025 - 10:15 IST