Aadhar: ఆధార్‌లో భారీ మార్పులు త్వరలో – ఫేస్ అథెంటికేషన్, కొత్త యాప్ రాబోతున్నాయి!
ఇప్పుడు ఫింగర్‌ప్రింట్, ఐరిస్ స్కాన్‌తో పాటు ఫేస్ అథెంటికేషన్‌ను కూడా ప్రవేశపెట్టేందుకు UIDAI సన్నద్ధమవుతోంది.
- By Dinesh Akula Published Date - 06:00 AM, Wed - 24 September 25

న్యూఢిల్లీ: (Aadhar Changes) దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ అత్యవసరమైన గుర్తింపు కార్డుగా మారిన ఆధార్‌లో మరోసారి కీలక మార్పులు జరగనున్నాయి. ఆధార్ సేవలను మరింత సులభంగా, సురక్షితంగా మార్చేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొన్ని కొత్త ఫీచర్లను త్వరలో అందుబాటులోకి తేనుంది.
ఇప్పటికే ఆధార్‌తో మబైల్ నంబర్, ఈమెయిల్, చిరునామా వంటి వివరాలను ఆన్‌లైన్‌లో మార్చుకునే సదుపాయం కల్పించగా, బయోమెట్రిక్ వేరిఫికేషన్ విధానాన్ని మరింత సమర్థవంతంగా మార్చారు. ఇప్పుడు ఫింగర్‌ప్రింట్, ఐరిస్ స్కాన్‌తో పాటు ఫేస్ అథెంటికేషన్‌ను కూడా ప్రవేశపెట్టేందుకు UIDAI సన్నద్ధమవుతోంది.
పొందబోయే మార్పుల వివరాలు ఇలా ఉన్నాయి:
-
ఫేస్ అథెంటికేషన్: ఆధార్ వెరిఫికేషన్ సమయంలో ఫింగర్ ప్రింట్, ఐరిస్‌తో పాటు ముఖం ద్వారా ధృవీకరణ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
-
నవీకృత ఆధార్ యాప్: ఆధార్ డిజిటల్ వాలెట్‌గా పనిచేసేలా ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నారు. దీనిలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వెరిఫికేషన్, డేటా భద్రత వంటి ఫీచర్లు ఉంటాయి.
-
ఆఫ్‌లైన్ వెరిఫికేషన్: ఇంటర్నెట్ అవసరం లేకుండా ఆధార్ వెరిఫికేషన్ చేసుకునేలా ప్రత్యేక సాంకేతికతను అందించనున్నారు.
-
ఎన్‌క్రిప్షన్, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్: యూజర్ల వ్యక్తిగత సమాచారం మరింత గోప్యంగా ఉండేందుకు నూతన భద్రతా వ్యవస్థలు తీసుకువస్తున్నారు.
ఇంతకుముందే ప్రారంభించిన మాస్క్డ్ ఆధార్ ద్వారా ఆధార్ నంబర్‌లో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే విధంగా రూపకల్పన చేశారు. ఇది ప్రైవసీ పరిరక్షణకు తోడ్పడుతుంది. ఇక బ్యాంకింగ్, సిమ్ కార్డు తీసుకోవడం వంటి సేవలకు ఈ ఆధునికీకరణలు ఉపయుక్తంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
ఈ మార్పులన్నీ ఒకే లక్ష్యంతో—యూజర్లకు సురక్షితమైన, వేగవంతమైన ఆధార్ సేవలు అందించడమే.