HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Rajya Sabha Bypolls For Four Seats In Jk One In Punjab Scheduled On October 24 Ec

Rajya Sabha Bypolls: రాజ్యసభ ఉప ఎన్నికల తేదీలను ప్ర‌క‌టించిన ఎన్నిక‌ల సంఘం!

జమ్మూ-కాశ్మీర్‌లో నాలుగు సీట్లు ఫిబ్రవరి 2021 నుండి ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల సంఘం సెప్టెంబర్ 22, 2025న ఉప ఎన్నికను ప్రకటించింది. దీని నోటిఫికేషన్ అక్టోబర్ 6న విడుదల అవుతుంది.

  • By Gopichand Published Date - 02:45 PM, Wed - 24 September 25
  • daily-hunt
Rajya Sabha Bypolls
Rajya Sabha Bypolls

Rajya Sabha Bypolls: భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రాజ్యసభ ఉప ఎన్నికల (Rajya Sabha Bypolls) తేదీలను ప్రకటించింది. పంజాబ్‌లోని ఒక ఖాళీ సీటు, జమ్మూ-కాశ్మీర్‌లోని నాలుగు ఖాళీ సీట్లను భర్తీ చేయడానికి అక్టోబర్ 24, 2025న ఉప ఎన్నికలు జరుగుతాయని ప్ర‌క‌టించింది. పంజాబ్‌లో ఎంపీ సంజీవ్ అరోరా రాజీనామా తర్వాత సీటు ఖాళీ అయింది. జమ్మూ-కాశ్మీర్‌లో నాలుగు సీట్లు ఫిబ్రవరి 2021 నుండి ఖాళీగా ఉన్నాయి.

పంజాబ్‌లో ఉప ఎన్నిక షెడ్యూల్

పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ నుండి ఆప్ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగి బస్సి జనవరి 2025లో మరణించారు. దీనికి జూన్ 19, 2025న ఉప ఎన్నిక జరిగింది. ఇందులో రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరా గెలుపొందారు. అయితే సంజీవ్ అరోరా అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత రాజ్యసభ పదవికి రాజీనామా చేయడంతో ఆ సీటు ఖాళీ అయింది. ఇప్పుడు ఆ ఖాళీ సీటుకు ఉప ఎన్నిక తేదీలను ప్రకటించారు.

ఎన్నికల సంఘం సెప్టెంబర్ 24, 2025న ఉప ఎన్నికను ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ 6, 2025న విడుదలవుతుంది. అక్టోబర్ 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 16 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అక్టోబర్ 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేసి కొత్త రాజ్యసభ ఎంపీని ప్రకటిస్తారు.

Also Read: IND vs WI: వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

సంజీవ్ అరోరా రాజీనామా తర్వాత పంజాబ్ రాజకీయ వర్గాల్లో అరవింద్ కేజ్రీవాల్ లేదా మనీష్ సిసోడియాను పంజాబ్ నుండి రాజ్యసభకు పంపవచ్చని చర్చ జరిగింది. కానీ ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ఎంపీ కావడానికి నిరాకరించి, రాజ్యసభకు వెళ్లే ఊహాగానాలకు ముగింపు పలికారు. ఇప్పుడు రాజ్యసభకు ఎవరు వెళ్తారనేది పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయిస్తుంది.

జమ్మూ-కాశ్మీర్‌లో షెడ్యూల్

జమ్మూ-కాశ్మీర్‌లో నాలుగు సీట్లు ఫిబ్రవరి 2021 నుండి ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల సంఘం సెప్టెంబర్ 22, 2025న ఉప ఎన్నికను ప్రకటించింది. దీని నోటిఫికేషన్ అక్టోబర్ 6న విడుదల అవుతుంది. అక్టోబర్ 13 వరకు నామినేషన్లు వేయవచ్చు. అక్టోబర్ 16 వరకు నామినేషన్లను వెనక్కి తీసుకోవచ్చు. అక్టోబర్ 24న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమై ఫలితాలు ప్రకటిస్తారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bypolls
  • Election commission
  • punjab
  • Rajya Sabha
  • Rajya Sabha Bypolls

Related News

Bihar Election 2025

Bihar Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే: మూడు దశల్లో పోలింగ్ నిర్వహణ ఊహించబడుతోంది

Bihar Elections: బిహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22, 2025తో ముగియనున్న నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలింగ్ రెండు లేదా మూడు విడతల్లో జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఛఠ్ పూజ వంటి ప్రాంతీయ పండుగలు పూర్తయ్యాక, నవంబర్ 5 నుండి 15 మధ్య ఎన్నికలు జరగవచ్చని అంచనాలు ఉన్నాయి. గతంలో కూడా 2020లో బ

  • Voting Machines

    Voting Machines: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. కీల‌క మార్పులు చేసిన ఎన్నిక‌ల క‌మిష‌న్‌!

Latest News

  • Royal Enfield Bullet: రూ. 1.62 లక్షలకే రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌!

  • OG కి బిగ్ షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు…టికెట్స్ కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి..?

  • OG : OG సినిమా ఇలాగే ఉండబోతుందా..?

  • Delhi Baba: 17 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఢిల్లీ బాబా!

  • Goddess Durga: దుర్గాదేవి 108 నామాలు – దసరా నవరాత్రుల్లో జపించాల్సిన అష్టోత్తర శతనామావళి

Trending News

    • Sonu Sood: సోనూసూద్ ఈడీ విచారణకు హాజరు – బెట్టింగ్ యాప్ మనీలాండరింగ్ కేసులో కదలిక

    • Cycling vs Walking: వాకింగ్ vs సైక్లింగ్ – ఆరోగ్యానికి ఏది బెస్ట్? నిపుణుల అభిప్రాయం

    • GST Reforms: జీఎస్టీ 2.0.. మొద‌టిరోజు అమ్మ‌కాలు ఏ రేంజ్‌లో జ‌రిగాయంటే?

    • Cash: ఇంట్లో ఎంత న‌గ‌దు ఉంచుకుంటే మంచిది?

    • GST 2.0: ఇక‌పై అత్యంత త‌క్కువ ధ‌ర‌కే ల‌భించే వ‌స్తువులీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd