HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Koil Alwar Thirumanjanam In Tirumala Srivari Temple

Koil Alwar Thirumanjanam: తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం!

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల ఆల్వార్ తిరుమంజ‌నం (Koil Alwar Thirumanjanam) ఘ‌నంగా నిర్వహించారు.

  • Author : Gopi Date : 09-07-2024 - 9:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Koil Alwar Thirumanjanam
Koil Alwar Thirumanjanam

Koil Alwar Thirumanjanam: తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల ఆల్వార్ తిరుమంజ‌నం (Koil Alwar Thirumanjanam) ఘ‌నంగా నిర్వహించారు. మంగ‌ళ‌వారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఆలయ శుద్ధి కార్యక్రమం 8 గంటల వరకు సాగిన ఈ సందర్భంగా ఆలయాన్ని సుగంధ ద్రవ్యాలు లేపనాలతో కలిపి శుభ్రం చేశారు. అంతకుముందు వేడి నీటితో ఆలయ గోడలను, గర్భగుడిని ఆనంద నిలయాన్ని శుభ్రం చేశారు. తర్వాత పచ్చ కర్పూరంతో పాటు కొన్ని మూలిక లేపనాలను కలిపి గోడలకు పూశారు. ఈ తంతు నిర్వహిస్తున్నప్పుడు స్వామివారి మూలవిరాట్ కు వస్త్రం కప్పి గర్భగుడి లోపలకు కూడా శుభ్రపరిచారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్యామల రావుతో పాటు ఆలయ అధికారులు, అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు. 16న ఆణివార ఆస్థానం ఉన్నందున అంతకుముందు మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం రివాజు. అందులో భాగంగానే ఈరోజు కోయిల్ అల్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. జూలై 16వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభ‌మైన‌ తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

Also Read: VN Aditya : అమెరికాలో కొత్త సినిమా తీస్తున్న తెలుగు దర్శకుడు.. ఆడిషన్స్ కూడా అక్కడే..

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సోమ‌వారం స్వామి వారిని 63,619 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,572 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. టీటీడీ ఈవోగా శ్యామ‌ల‌రావు బాధ్య‌త‌లు చేప‌ట్టాక ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే అనేస సేవా కార్య‌క్ర‌మాలు సైతం చేప‌ట్టారు.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • Koil Alwar Thirumanjanam
  • Tirumala Tirupathi Devasthanam
  • Tirupati

Related News

Apsrtc

APSRTC ఉద్యోగుల నిరీక్షణకు తెర..వారి ఖాతాల్లోకి రూ. 75 కోట్లు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఈ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది

    Latest News

    • ఏపీ సలహాదారు పదవికి సీతా శర్మ రాజీనామా

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు!

    • Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు రాజకీయ ప్రస్థానం ఇదే!

    • కాబోయే భార్య‌తో గంగా హారతిలో పాల్గొన్న టీమిండియా ప్లేయ‌ర్‌!

    Trending News

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

      • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

      • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

      • అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd