HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Gold Prices Rise Again Silver Prices Fall

Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధరలు

  • Author : Vamsi Chowdary Korata Date : 15-04-2026 - 10:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Today Gold Silver Prices
Today Gold Silver Prices

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత వారంలో ఒక్కరోజు మాత్రమే అది కూడా స్వల్పంగా తగ్గింది. ఇప్పుడు ఇరాన్- అమెరికా చర్చలపై ఆశలతో క్రూడాయిల్ ధరలు భారీగా పతనం అయ్యాయి. 10 శాతానికి పైగా దిగొచ్చాయి. దీంతో బంగారం ధరలు అదే స్థాయిలో పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు హైదరాబాద్ నగరంలో రూ. 1300 పెరిగి తులం రూ. 1,42,400కు చేరింది.

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అలర్ట్. గోల్డ్ రేట్లు మళ్లీ వరుసగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలే ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్- అమెరికా మధ్య రెండో దశ చర్చలు మరో 2 రోజుల్లో జరగనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇస్లామాబాద్ వేదికగానే జరుగుతాయని చెప్పగా.. ఇరాన్ కూడా దీనికి అంగీకరించినట్లు సమాచారం. ఈ ప్రకటన నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పతనం అయ్యాయి. క్రూడాయిల్ ధరలు పతనం అయితే సాధారణంగానే బంగారం ధరలు పెరుగుతుంటాయి. కొద్ది రోజులుగా యుద్ధం జరుగుతున్నప్పటి నుంచి ఇదే జరుగుతోంది. ఇప్పుడదే జరిగింది. బంగారం ధరలు మళ్లీ ఏప్రిల్ 15న ఉదయం 10 గంటల తర్వాత భారీగా పెరిగాయి.

హైదరాబాద్ నగరంలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1300 పెరగగా.. తులం ఇప్పుడు రూ. 1,42,400 వద్ద కొనసాగుతోంది. ముందటి రోజు రూ. 1350 పెరిగింది. దానికి ముందు మాత్రం స్వల్పంగా రూ. 350 తగ్గింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు రూ. 1420 పెరగడంతో 10 గ్రాములకు హైదరాబాద్ మార్కెట్లో రూ. 1,55,350 వద్ద ఉంది. ఇది ముందటి రోజు రూ. 1470 మేర పెరిగింది.

బంగారం ధర పరిస్థితి ఇలా ఉండగా.. వెండి ధర ఒక్కరోజులోనే మరో రూ. 10 వేలు పెరిగింది. దీంతో ఇప్పుడు ఏప్రిల్ 15న కేజీ సిల్వర్ రేటు రూ. 2.75 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది. ముందటి రోజు రూ. 5 వేల మేర పెరగ్గా.. దానికి ముందు రూ. 5 వేలు తగ్గింది. అయినప్పటికీ వెండి ధర ఇప్పటికీ ఆల్ టైమ్ హైకి చాలా దూరంలోనే ఉంది. జనవరి 29న కిలో వెండి ధర రూ. 4.25 లక్షలు పలికింది. అక్కడి నుంచి చూస్తే రూ. 1.50 లక్షలు తగ్గిందని చెప్పొచ్చు.

ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరల్లో భారీ మార్పు కనిపించింది. కిందటి రోజు ఉదయం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4750 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఇప్పుడు ఏప్రిల్ 15న ఉదయం 10 గంటల సమయంలో ఇది 4,820 డాలర్ల మార్కుపైకి చేరింది. ఇంకా సిల్వర్ రేటు 74 డాలర్ల స్థాయి నుంచి ఇప్పుడు 80 డాలర్ల మార్కుకు ఎగబాకింది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 93.17 వద్ద కొనసాగుతోంది. ఇది కిందటి రోజుతో పోలిస్తే పుంజుకుందని చెప్పొచ్చు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22K gold rate
  • 24K gold rate
  • Daily gold price
  • Delhi gold prices
  • Global Gold Prices
  • Gold and Silver Rates Today
  • gold price
  • Gold- Silver Rates
  • silver rate

Related News

Gold Silver Prices See Shar

Gold Rate Today : గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు

అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 380 తగ్గి రూ. 1,52,460కి చేరుకుంది. అదేవిధంగా, సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 350 తగ్గి రూ. 1,39,750 వద్ద కొనసాగుతోంది

  • Gold Price Today : పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త..భారీగా తగ్గిన బంగారం ధర

    Gold Price : ఆగని బంగారం ధర..ఈరోజు తులం ఎంత పెరిగిందంటే !!

Latest News

  • Andhra Pradesh: ఏపీలో రూ.82.49 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్

  • వామ్మో చర్చి పాస్టర్‌ ఇంట్లో 2.27 కోట్లు

  • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026లో మ్యాచ్ ఫిక్సింగ్‌?!

  • Rajinikanth: కోలీవుడ్‌లో మరో షాక్.. రజనీ ‘జైలర్ 2’ సీన్స్ లీక్!

Trending News

    • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

    • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

    • సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 106 పరుగులు మాత్రమే!

    • BJP MP Tejasvi Surya: ఏపీ విభజనపై ఎంపీ తేజస్వి సూర్య ఫైర్

    • అంపైర్ల పొరపాటు.. జరిమానా విధించాలని డిమాండ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd