Sharmila : జగన్ గారు..సొంత బాబాయ్ హత్యకు గురైతే ధర్నా చేయలేదేం? : షర్మిల
అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీకి వెళుతున్నారని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ఢిల్లీలో ధర్నా చేశారని నిలదీశారు.
- By Latha Suma Published Date - 03:10 PM, Mon - 22 July 24

YS Sharmila:ఏపి కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్(Jagan)పై విమర్శుల గుప్పించారు. ఏపిలో హత్య రాజకీయాలపై దేశ రాజధానిలో వైసీపీ ధర్మా చేస్తుందంటూ ఇటివల జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీకి వెళుతున్నారని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ఢిల్లీలో ధర్నా చేశారని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడలేకపోయారని మండిపడ్డారు. ఈమేరకు సోమవారం విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.. సొంత బాబాయ్ హత్యకు గురైతే ధర్నా చేయలేదేం? హంతకులతో ఇప్పటికీ భుజాలు రాసుకుంటూ తిరుగుతూ సొంత చెల్లెళ్లకే వెన్నుపోటు పొడిచారు.
We’re now on WhatsApp. Click to Join.
ఐదేళ్ల పాలనలో ఏపికి ప్రత్యేక హోదా(special status) కోసం ఏప్పుడైనా ధర్మా చేశారు? మరి ఇప్పుడు ఎందుకు ధర్మాలు? అధికారలో ఉన్నన్ని రోజులు ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు. పోలవరం ప్రాజెక్టును, కడప, విశాక ఉక్కు ఫ్యాక్టరీలను పట్టించుకోలేదు, మూడు రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేశారు. వీటన్నిటిపై ఏనాడూ ధర్నా చేయలేదు కానీ మీ పార్టీ కార్యకర్త చనిపోతే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారా? అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా తప్పించుకునేందుకే ఈ ఎత్తు వేశారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నదే 11 మంది, ఉన్న ఆ కొద్దిమందైనా అసెంబ్లీలో చర్చలో పాల్గొనరా? ప్రజావ్యతిరేక బిల్లులపై పాలకపక్షంతో కొట్లాడే అవసరం మీకు లేదనుకుంటున్నారా అంటూ జగన్ ను షర్మిల నిలదీశారు. వినుకొండలో జరిగిన హత్యకు కారణం వ్యక్తిగత కక్షలేనని పోలీసులు కూడా తేల్చేశారని షర్మిల గుర్తుచేశారు. హతుడు, హంతకుడు ఇద్దరూ నిన్నమొన్నటి వరకు వైసీపీతోనే ఉన్నారని గుర్తుచేస్తూ.. ఇది రాజకీయ హత్య ఎలా అవుతుందని నిలదీశారు.
Read Also: Madanapalle RDO Fire: మదనపల్లె ఆర్డీఓ సీనియర్ అసిస్టెంట్ అరెస్ట్
కాగా, రాష్ట్రంలో ఓవైపు భారీ వర్షాల(Heavy rains)కు చాలా మంది జనం వరదల్లో చిక్కుకున్నారని, ఇల్లూ వాకిలీ నీట మునుగడంతో దిక్కుతోచక రోదిస్తున్నారని షర్మిల అన్నారు. వారిని పరామర్శించి ధైర్యం చెప్పాలని అనిపించడం లేదా? అంటూ జగన్ ను ప్రశ్నించారు. ‘కేవలం మీ పార్టీ వాళ్లు ఓటు వేస్తేనే మీరు గెలిచారా? ఐదేళ్లు ప్రజల కోసం పనిచేయలేదు కానీ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారంట.. సిగ్గుండాలి కదా’ అంటూ జగన్ పై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. వినుకొండ మర్డర్ వ్యక్తిగత మర్డర్… పొలిటికల్ మర్డర్ కాదన్నారు. పోలీసులు ఇలాంటి హత్యలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని… పవన్ కళ్యాణ్ కు ఇలాంటి హత్యలు జరుగుతుంటే బాధ్యత లేదా అని ప్రశ్నించారు.
Read Also: Bhadrachalam : భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ