HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Stays Away From Rajya Sabha Contest

Rajyasabha : రాజ్యసభ పోటీకి దూరంగా బిఆర్ఎస్..ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ కేనా ?

తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి తమ నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల చివరి రోజైన గురువారం

  • Author : Sudheer Date : 05-03-2026 - 8:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Brs Car
Brs Car

తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి తమ నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల చివరి రోజైన గురువారం వరకు ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ (BRS) తన అభ్యర్థిని రంగంలోకి దింపకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక స్థానం ఎలాగూ కాంగ్రెస్‌కు దక్కుతుండగా, రెండో స్థానం (బిఆర్ఎస్ సిట్టింగ్ సీటు) కోసం కూడా కారు పార్టీ కనీస పోటీ ఇవ్వకుండా తప్పుకోవడం గమనార్హం. సంఖ్యాబలం తక్కువగా ఉండటం మరియు ఎమ్మెల్యేల చేజారుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే బిఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

వేం నరేందర్ రెడ్డి ఎంపిక – రేవంత్ మార్క్ రాజకీయం

రెండో రాజ్యసభ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ, చివరి నిమిషంలో వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారు కావడం సీఎం రేవంత్ రెడ్డి పట్టును మరోసారి నిరూపించింది. సింఘ్వీ ఎంపిక ముందే ఖరారు కాగా, రెండో సీటు కోసం అధిష్టానం ఎవరిని ఎంచుకుంటుందన్న ఉత్కంఠకు తెరదించుతూ గురువారం అర్ధరాత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. తన సన్నిహితుడికి అవకాశం ఇప్పించుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. వేం నరేందర్ రెడ్డి తన నామినేషన్ దాఖలు చేయడానికి ముందే ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఎంఐఎం పార్టీ మద్దతు కూడా కాంగ్రెస్‌కు లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఏకగ్రీవం దిశగా ఎన్నిక

ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరితో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి మాత్రమే నామినేషన్ వేశారు. అయితే స్వతంత్ర అభ్యర్థికి అవసరమైన 10 మంది ఎమ్మెల్యేల బలము లేకపోవడంతో ఆ నామినేషన్ స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే అభిషేక్ మను సింఘ్వీ మరియు వేం నరేందర్ రెడ్డిల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మార్చి 6న నామినేషన్ల పరిశీలన, మార్చి 9 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ఒకవేళ పోలింగ్ అనివార్యమైతే మార్చి 16న ఓటింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఏది ఏమైనా, బిఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండటంతో ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం ఇప్పుడు కేవలం లాంఛనమే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Abhishek Singhvi
  • brs
  • congress
  • Rajya Sabha poll nominations
  • rajyasabha
  • Vem Narender Reddy

Related News

KTR- Harish Rao

BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ నాయకత్వంపై పలు విమర్శలు, ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్‌రావు రాష్ట్ర యువతను హింసాత్మక మార్గాల వైపు ప్రేరేపిస్తున్నారంటూ కొన్ని రాజకీయ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. పదేళ్లపాటు అధికారంలో ఉన్న తర్వాత కూడా బీఆర్‌ఎస్ నాయకత్వం ప్రజాస్వామ్య మార్గాల కంటే ఆందోళనలు, నిరసనలు, దూకుడు రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్

  • Ev Bus

    EV Bus : కాలుష్యానికి చెక్.. నగర రోడ్లపైకి 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

  • V.D. Satheesan Sworn In as Kerala CM

    Kerala CM : నేడు ప్ర‌ధాని మోదీతో కేర‌ళ సీఎం భేటీ.. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

  • Chikkamagaluru Farmers

    Farmers Protest : చిక్కమగళూరులో రైతులు ఆందోళ‌న‌.. ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం

Latest News

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

  • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

  • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

  • Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd