Madanapalle RDO Fire: మదనపల్లె ఆర్డీఓ సీనియర్ అసిస్టెంట్ అరెస్ట్
మదనపల్లె ఆర్డీఓ కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసుపై మరింత క్యూరియాసిటీ నెలకొంది.
- By Praveen Aluthuru Published Date - 03:03 PM, Mon - 22 July 24

Madanapalle RDO Fire: రాష్ట్రంలో సంచలనం రేపిన మదనపల్లె ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కీలక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. చంద్రబాబు ఘటనపై సీరియస్ కావడంతో అధికార యంత్రాంగం వేగంగా కదులుతుంది. అందులో భాగంగా మదనపల్లె ఆర్డీఓ కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసుపై మరింత క్యూరియాసిటీ నెలకొంది.
మదనపల్లె ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో విలువైన ఫైళ్లు దగ్ధమయ్యాయి. అయితే కార్యాలయంలోని 22ఎ సెక్షన్ భూములపై గౌతమ్ దందా సాగిస్తున్నట్లు తెలిసింది. ఆదివారం సెలవు దినమైనా రాత్రి 10.30 గంటల వరకు అతను కార్యాలయంలోనే ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి అసైన్డ్ భూములు, కోర్టు కేసుల్లో ఉన్నవి, 22 ఎ భూములకు సంబంధించిన ఫైళ్లు కాలిపోయినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి.
ఈ ఘటనపై ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్‌తో కూడా మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. పోలీసు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారని, ఫలితం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సీసీ టీవీ ఫుటేజీలను భద్రపరచాలని జిల్లా అధికారులను ఆదేశించిన సీఎం.. సెలవు దినమైనా గౌతమ్ రాత్రి వరకు ఎందుకు విధుల్లో ఉన్నారని ఆరా తీశారు.
Also Read: Bhadrachalam : భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ