HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Two Mps For Bhimavaram Previously Lok Sabha Recently Rajya Sabha What Is Bjps Plan

BJP Big Plan: గోదావరి జిల్లాలపై బీజేపీ గురి.. ఇద్దరు ఎంపీలతో బిగ్ స్కెచ్

గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానంలో  బీజేపీ(BJP Big Plan) ఎంపీ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస వర్మ దాదాపు  రెండు లక్షల 75 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.

  • Author : Pasha Date : 01-05-2025 - 9:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bhimavaram Lok Sabha Rajya Sabha Bjp Plan Bhimavaram Plan Andhra Pradesh Politics

BJP Big Plan:   ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలపై బీజేపీ గురిపెట్టింది. వాటికి  ఆర్థిక రాజధానిగా పేరొందిన భీమవరంపై స్పెషల్ ఫోకస్‌తో ముందుకు సాగుతోంది. ఈక్రమంలోనే  పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బీజేపీ నేత పాకా సత్యనారాయణకు ఇటీవలే రాజ్యసభ సీటు దక్కింది. సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీగా ఎన్నికైన బీజేపీ నేత భూపతి రాజు శ్రీనివాసవర్మకు కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం లభించింది. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రాజమండ్రికి చెందిన సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. వీరంతా మొదటి నుంచీ బీజేపీలో ఉన్నసీనియర్ నేతలే. ఏపీలో పార్టీకి విధేయంగా ఉన్నవారికి అవకాశాలు కల్పించడానికి  ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రయారిటీ ఇస్తున్నారు. పాకా సత్యనారాయణ, భూపతి రాజు శ్రీనివాసవర్మ, సోము వీర్రాజులకు దక్కిన అవకాశాలే అందుకు సంకేతం. పాకా సత్యనారాయణ 45 సంవత్సరాలుగా బీజేపీలో పనిచేస్తుంటే, శ్రీనివాస వర్మకు బీజేపీతో 35 ఏళ్లుగా అనుబంధం ఉంది.

Also Read :ATM Charges Hike: నేటి నుంచే ఏటీఎం ఛార్జీల పెంపు.. ఎంత ?

సామాజిక వర్గాలవారీగా.. 

పశ్చిమగోదావరి జిల్లాలోని కీలక సామాజిక వర్గాలను తమకు చేరువ చేసుకోవడంపై బీజేపీ దృష్టి పెట్టింది.  తాజాగా  రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్న పాకా సత్యనారాయణ భీమవరంలోని గౌడ సామాజిక వర్గం నేత. భూపతి రాజు శ్రీనివాసవర్మ క్షత్రియ వర్గం నేత. సోమువీర్రాజు కాపు వర్గం నేత. ఈ మూడు సామాజిక వర్గాలు తమకు చేరువైతే వచ్చే ఎన్నికల నాటికి ఉభయ గోదావరి జిల్లాల్లో ఆశాజనక స్థాయిలో అసెంబ్లీ సీట్లను గెల్చుకోవచ్చని బీజేపీ భావిస్తోంది.

Also Read :AP DGP : ఏపీ డీజీపీగా హరీశ్‌కుమార్‌ గుప్తా.. నేపథ్యమిదీ

భారీ మెజారిటీతో ఓటుబ్యాంకు.. 

గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానంలో  బీజేపీ(BJP Big Plan) ఎంపీ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస వర్మ దాదాపు  రెండు లక్షల 75 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీన్నిబట్టి అక్కడ బీజేపీకి బలమైన ఓటుబ్యాంకు ఏర్పడింది. ఇదే ట్రెండును కొనసాగిస్తూ.. ఉభయ గోదావరి జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాలపైనా పట్టు సంపాదించాలని బీజేపీ యోచిస్తోంది. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయిలో బలపడాలని, క్యాడర్‌ను పెంచుకోవాలని భావిస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 8 ఎమ్మెల్యే సీట్లను బీజేపీ గెల్చుకుంది. వచ్చే ఎన్నికల్లో ఈ సంఖ్యను 24కు చేర్చాలనే పట్టుదలతో బీజేపీ పెద్దలు ఉన్నారు. ఆ దిశగానే స్కెచ్ అమలవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్సార్ సీపీ నుంచి బలమైన నేతలను తమ వైపునకు తీసుకొని ఈ టార్గెట్‌ను పూర్తి చేయాలని ప్లాన్లు రెడీ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap politics
  • bhimavaram
  • Bhimavaram Plan
  • bjp
  • BJP Big Plan
  • lok sabha
  • Rajya Sabha

Related News

INS Mahendragiri joins the Indian Navy.

INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో యుద్ధనౌకను ప్రారంభించారు. ప్రాజెక్ట్ 17A నీలగిరి-క్లాస్ ప్రోగ్రామ్ కింద ఆరవ నౌక అయిన, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ప్రారంభించడంతో భారత నౌకాదళం శనివారం తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో ఈ యుద్ధనౌకను ప్రారంభించారు

  • State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

    Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • It is because of CM Chandrababu that it is not raining: Former Minister

    Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

  • Prashant Kishor To Contest

    Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

Latest News

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

  • FSSAI: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు..

  • Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

  • Gold Rate: పసిడి ప్రేమికులకు పండగే.. కుప్పకూలిన బంగారం ధరలు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd