Gold Rate: పసిడి ప్రేమికులకు పండగే.. కుప్పకూలిన బంగారం ధరలు
- Author : Vamsi Chowdary Korata
Date : 11-07-2026 - 12:39 IST
Published By : Hashtagu Telugu Desk
పసిడి ప్రియులకు ఇది నిజంగా పండగే. దేశీయ మార్కెట్లో జులై 11వ తేదీన బంగారం ధరలు కుప్పకూలాయి. ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 490 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 450 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 370 రూపాయలు తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం.. ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,330 రూపాయల వద్ద.. 22 క్యారెట్ల బంగారం ధర 1,32,300 రూపాయల వద్ద.. 18 క్యారెట్ల బంగారం ధర 1,08,250 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.