HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Lokesh To Visakhapatnam Tomorrow Why

Minister Lokesh: రేపు విశాఖ‌కు మంత్రి లోకేష్‌.. ఎందుకంటే?

విశాఖను డేటా సెంటర్ల హబ్‌గా మార్చాలనే లోకేష్ కృషి ఫలితంగా ఇప్పటికే అనేక దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. టీసీఎస్ 2 గిగావాట్లు, గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ 1 గిగావాట్ మరియు సిఫీ 450 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి.

  • Author : Gopi Date : 11-10-2025 - 12:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Lokesh
Minister Lokesh

Minister Lokesh: ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) చొరవతో విశాఖపట్నం త్వరలో డేటా సెంటర్ల హబ్‌గా రూపుదిద్దుకోనుంది. ఏకంగా 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న లోకేష్ ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

రేపు సిఫీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

ఈ ప్రయత్నంలో భాగంగా అక్టోబర్ 12వ తేదీ ఆదివారం నాడు మంత్రి నారా లోకేష్ విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సిఫీ (Sify) ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ (CLS)కు ఆయన శంకుస్థాపన చేస్తారు. నాస్‌డాక్‌లో నమోదైన దేశ ప్రముఖ డిజిటల్ ఐసీటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ (Sify Infinit Spaces Limited) ఈ 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌ను నిర్మించనుంది.

రూ. 1,500 కోట్ల పెట్టుబడి, వెయ్యికి పైగా ఉద్యోగాలు

రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాల భూమిలో రూ. 1,500 కోట్ల భారీ పెట్టుబడితో సిఫీ ఈ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌ను రెండు దశల్లో అభివృద్ధి చేయనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాకతో విశాఖ భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్ వేగా రూపుదిద్దుకోవడంతో పాటు సముద్రపు కేబుల్ కనెక్టివిటీ, ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది.

Also Read: ‎Spiritual: ఇంట్లో ఈ నాలుగు ఉంటే చాలు.. లక్ష్మీ అనుగ్రహం మీకు కలిగినట్టే!

విశాఖ వ్యూహాత్మక సీఎల్ఎస్ పాయింట్‌గా

నూతనంగా ఏర్పాటు చేయనున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ (CLS) సదుపాయం సముద్రపు కేబుల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఈ సీఎల్ఎస్ ద్వారా భారతదేశంతో పాటు ఆగ్నేయాసియాలోని సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయిలాండ్ వంటి దేశాల మధ్య వేగంగా డేటా ప్రాసెసింగ్ చేయబడుతుంది. దీంతో విశాఖ వ్యూహాత్మక ల్యాండింగ్ పాయింట్‌గా పనిచేస్తుంది.

ప్రపంచంలోనే నంబర్ 1 స్థానం లక్ష్యం

విశాఖను డేటా సెంటర్ల హబ్‌గా మార్చాలనే లోకేష్ కృషి ఫలితంగా ఇప్పటికే అనేక దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. టీసీఎస్ 2 గిగావాట్లు, గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ 1 గిగావాట్ మరియు సిఫీ 450 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి. ఈ భారీ పెట్టుబడులతో విశాఖ మొత్తం సామర్థ్యం 3.5 గిగావాట్లకు చేరి, ప్రస్తుతం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న అమెరికాలోని వర్జీనియా (1.3 గిగావాట్లు)ను అధిగమించి, ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపనుంది. ఈ పరిణామాలతో రానున్న ఐదేళ్లలో లక్షన్నర మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని ఐటీ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • Minister Lokesh
  • telugu news
  • Visakhapatnam

Related News

Massive fire in Visakhapatnam's Gajuwaka; flames raging at a firecracker shop!

Visakhapatnam: విశాఖ గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం.. పటాకుల దుకాణంలో ఎగిసిపడుతున్న మంటలు!

విశాఖపట్నంలోని అత్యంత రద్దీగా ఉండే కొత్త గాజువాక మార్కెట్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడున్న ‘శివ ఫైర్‌వర్క్స్’ అనే టపాసుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దుకాణం నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ ఎగసిపడటంతో మార్కెట్ రోడ్డు అంతా గందరగోళంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్నిమా

  • Iran and the US sign peace agreement.

    US-Iran Peace Deal: శాంతి ఒప్పందంపై ఇరాన్, అమెరికా సంతకాలు

  • Big alert for candidates: NEET 're-exam' date fixed.

    NEET: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ డేట్ ఫిక్స్

  • The people are the ultimate arbiters of a historic victory: Deputy CM Pawan.

    Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

Latest News

  • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

  • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

  • Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

  • Vedanta Power : స్టాక్ మార్కెట్లోకి వేదాంత పవర్ ఎంట్రీ

  • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd