Spiritual: ఇంట్లో ఈ నాలుగు ఉంటే చాలు.. లక్ష్మీ అనుగ్రహం మీకు కలిగినట్టే!
Spiritual: ఇప్పుడు చెప్పబోయే నాలుగు రకాల వస్తువులు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీ అనుగ్రహం మీకు కలిగినట్టే, ఎలాంటి డబ్బు సమస్యలు ఉండవు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 06:30 AM, Sat - 11 October 25

Spiritual: హిందువులు ఎక్కువగా కొలిచే దేవుళ్ళను లక్ష్మీదేవి కూడా ఒకరు. వారంలో శుక్రవారంతో పాటు ఇంకా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో అమ్మ భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. సంపదకు అది దేవత అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ఎన్నెన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటారు. పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఒక్కసారి లక్ష్మి దేవి అనుగ్రహం కలిగింది అంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవని నమ్ముతూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఉంటారు. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయాలో ఎలాంటి పరిహారంలో పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
హిందూ మతంలో శంఖానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చాలా మంది ఇంట్లోనే పూజ మందిరంలో శంఖాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. అలాగే దేవుడిని పూజించేటప్పుడు శంఖాన్ని ఊదడం అనే సంప్రదాయం చాలా సంవత్సరాలుగా దేవాలయాలలో కొనసాగుతుంది. విష్ణు పూరాణంలో కూడా లక్ష్మీదేవి శంఖంలో నివసిస్తుందని ప్రస్తావిస్తారు. అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ గదిలో శంఖం ఉంచుకోవాలట. ఇలా ఉంచుకుంటే, లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందట. శంఖువు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతున్నారు. అలాగే మనం ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగించే చీపురు వాస్తు పరంగా చాలా ముఖ్యమైనదట.
లక్ష్మీదేవి చీపురులో నివసిస్తుందని చెబుతారు. కాబట్టి చీపురును అవమానించకూడదు లేదా దానం చేయకూడదని వాస్తులో ప్రస్తావించారు. మీరు చీపురుపై అడుగు పెడితే లేదా ఎవరికైనా దానం చేస్తే, లక్ష్మీదేవి మీపై కోపంగించుకోవచ్చట. దీని కారణంగా మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని చెబుతున్నారు. అలాగే తులసి మొక్కను దేవతగా భావించి పూజలు చేస్తారు. విష్ణువు అవతారమైన కృష్ణుడు తులసిని భూమికి తీసుకువచ్చాడని నమ్ముతారు. తులసి ఆకులు లేకుండా కృష్ణుడు ఆహారం కూడా తీసుకోడు. కాబట్టి లక్ష్మీదేవి తులసిలో నివసిస్తుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం తులసి మొక్కను ఇంటికి తూర్పు దిశలో నాటాలట. తూర్పు దిశలో స్థలం లేకపోతే, తులసి మొక్కను ఇంటికి ఉత్తర దిశలో కూడా నాటవచ్చట ఇలా చేయడం ద్వారా, మహాలక్ష్మి ఇంట్లో నివసిస్తుందని లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతున్నారు. మహాలక్ష్మి కమలం పువ్వుపై కూర్చుని ఉండటం చూడవచ్చు. కమలం పువ్వు లక్ష్మీ దేవికి చాలా ప్రియమైనది. మహాలక్ష్మి కమలంలో నివసిస్తుంది. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక కుండలో నీటిని నింపి, అందులో వికసించే కమలం పువ్వును ఉంచడం వల్ల మీరు మహాలక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించవచ్చట.